లక్షలు పలికే ఖరీదైన ఫ్యాన్సీ నెంబర్‌ను రూ.50వేలకే దక్కించుకున్న మేయర్ బొంతు
హైదరాబాద్: చాలామంది తమ కార్లకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ప్రయత్నాలు చేస్తారు. డబ్బులు పెట్టి మరీ కొనుగోలు చేస్తారు. ఫ్యాన్సీ నెంబర్లకు చాలా డిమాండ్ ఉంటుంది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో బుధవారం 9999 (ఆల్ నైన్స్) ఫ్యాన్సీ నెంబర్ నిర్ణీత రిజర్వ్ ధరనే పలికింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రవాణా శాఖ చరిత్రలోనే ఇంత తక్కువ ధర పలకడం రికార్డుగా చెబుతున్నారు.
టీఎస్ 09తో మొదలయ్యే ప్రతి సిరీస్‌లోను 9999 ప్యాన్సీ నెంబర్‌కు రూ.7 నుంచి రూ.11 లక్షల మధ్య బిడ్స్ వస్తాయి. ఈసారి టీఎస్ 09 ఎఫ్‌డీ 9999 ఫ్యాన్సీ నెంబర్ కేవలం రూ.50వేలు పలికింది. ఈ ఫ్యాన్సీ నెంబర్ రిజర్వ్ ధర రూ.50 వేలుగా రవాణా శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎవరూ పోటీకి రాలేదట.

ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం తరుచూ మంత్రులు, ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఓపెన్ బిడ్ కావడంతో సినీ నటులు, బడా పారిశ్రామికవేత్తలు లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకునేవారు. కానీ ఇప్పుడు కేవలం రూ.50 వేలకు ఈ ఫ్యాన్సీ నెంబర్ ఇవ్వడం వెనుక ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో బుధవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఒకేరోజు రూ.14,59,320ల ఆదాయం సమకూర్తింది. టీఎస్09 ఎఫ్‌ఈ 0009 ఫ్యాన్సీ నెంబరును రూ.2.10 లక్షలకు, టీఎస్09 ఎఫ్‌ఈ 0009ను రూ.1.60 లక్షలకు, టీఎస్09 ఎఫ్‌ఈ 0099ను రూ.1.35 లక్షలకు కొందరు యజమానులు వేలంలో సొంతం చేసుకున్నారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications