సరస్వతికీ మోసం, వంచన: పెళ్లి చేసుకోవాలని అడగడమే పాపం.. చివరికీ ఇలా..
ప్రేమించడమే పాపమైపోయింది. అప్పటివరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. పెళ్లి ప్రస్తావన రాగా.. అతనిలో మూర్ఖుడు నిద్రలేచాడు. ఆ యువతిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ అల్వాల్‌లో జరిగింది. ప్రేమ పేరుతో అతను టైం పాస్ చేశాడు. పెళ్లి అనగానే.. అంతే, వద్దని చెప్పాడు. తనకు ఎప్పటికీ ఈ పోరు తప్పదు అనుకున్నాడో ఏమో గానీ.. యువతిని మట్టుబెట్టాడు.

డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థినీ
ఓల్డ్ అల్వాల్ సాయిబాబానగర్‌కు చెందిన సరస్వతి బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. భూదేవినగర్‌కు చెందిన దీపక్, సరస్వతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని దీపక్‌పై కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోంది. దీనిపై అతను దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు. సోమవారం తన స్నేహితుడికి ఫోన్ చేసి సరస్వతిని చంపేస్తున్నానని చెప్పినట్లు తెలిసింది. కానీ అతను నమ్మలేదు. జోక్ చేయవద్దు అని స్నేహితుడు ఈ విషయాన్ని తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు చేరవేశారు.

తిరిగిరానీ సరస్వతీ
ఉదయం ఇంటి నుంచి బయిటికి వెళ్లిన సరస్వతి సాయంత్రం అయినా తిరిగి రాలేదు. దీంతో ఆమె పేరంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రేమికురాలిని చంపుతానని దీపక్ స్నేహితుడు చెప్పిన విషయం.. కనిపించకుండా పోయిన యువతి ఒక్కరే కావడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వారిద్దరూ తరచూ బీహెచ్‌ఈఎల్ క్వార్టర్స్ వెనుక ఉన్న రైల్వే ట్రాక్ వద్ద కలుసుకునే వారనే విషయం తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున అక్కడికి వెళ్లి చూడగా సరస్వతి మృతదేహం కనిపించింది.

హత్య చేసి
చున్నీని గొంతుకు బిగించి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. వివాహం విషయంలో ఒత్తిడి వల్లే దీపక్ ఆమెను హతమార్చి ఉండొచ్చని తెలుస్తోంది. తమ కూతురిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తోంది. దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందనే అంశానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని.. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని సరస్వతీ పేరంట్స్ కోరుతున్నారు. తమ లాగా మరొ తల్లి, తండ్రి బాధ పడొద్దు అని చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications