బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా: సాయి శ్రీయ సోలోగా డ్యాన్స్, అదే ఉత్సాహం, ఊపుతో చిందులు

బుల్లెట్ బండెక్కి వచ్చేత పా.. అనే సాంగ్‌కి మాములు క్రేజీ లేదు. కొత్త జంట సాయి శ్రీయ, అశోక్ యావత్ ప్రపంచానికి తెలిసిపోయారు. ఇప్పుడు అంతా అదే పాట.. అదే చర్చ.. పలువురు డ్యాన్స్ చేసి మరీ వీడియోలను షేర్ చేస్తున్నారు. పెళ్లిలలో చాలా మంది డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి కూతురు, పిల్లలు కూడా.. నిన్న అధికార పార్టీకి చెందిన ఎంపీ కూడా చిందులేశారు. ఇప్పుడు సాయి శ్రీయకు సంబంధించి మరో వీడియో వైరల్ అవుతోంది. అదే పాటకు.. ఓ ఫంక్షన్‌లో సాయి శ్రీయ డ్యాన్స్ చేశారు. కానీ సోలోగా కాలు కదిపారు. అదే ఎనర్జీతో చేసిన డ్యాన్స్ వీడియోకు.. జనం కూడా ఇదివరకటిలా నీరాజనం పలుకుతున్నారు.ఇటు కోరుట్లలో కూడా నవ వధువు డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఎదురుగా భర్త ఉండగా.. డ్యాన్స్ చేసి అలరించింది.

 మరో డ్యాన్స్

మరో డ్యాన్స్

ఫంక్షన్ ఎక్కడ జరిగిందో తెలియలేదు కానీ.. సాయి శ్రీయ ఒక్కరే డ్యాన్స్ చేశారు. ఆ పాటలో ఆమె భర్త అశోక్ లేరు. గాగ్రా డ్రెస్ వేసుకొని.. అదేవిధంగా డ్యాన్స్ చేశారు. పక్క ఉన్న వారి కేరింతల మధ్య ఆమె డ్యాన్స్ కొనసాగింది. ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. తన చేసిన డ్యాన్స్ మళ్లీ చేశారు.. అయినా దానికి మాములు క్రేజ్ లేకుండా పోయింది.

మారుమోగుతోంది..

మారుమోగుతోంది..

బుల్లెట్ పాట.. ఎక్కడ చూసినా మారుమోగుతోంది. ఫంక్షన్.. ఆటో, కార్లలో కూడా ఆ పాట మోత మోగుతోంది. పాట వచ్చి చాలా రోజులైనా.. సాయి శ్రీయ డ్యాన్స్‌తో ప్రపంచానికి తెలిసింది. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేత ముత్యం వెంకన్న గౌడ్ కుమారుడి వివాహ వేడుక జరిగింది. ఎంపీ మాలోతు కవిత హాజరయ్యారు. నూతన వధువరూలను ఆశీర్వదించారు. తర్వాత బుల్లెట్ పాట మోత మోగింది. ఇంకేముంది ఎంపీ కూడా స్టెప్పులు వేశారు. అందరినీ ఉత్సాహ పరిచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవిత దోస్తులు, నేతలు కూడా డ్యాన్స్ చేశారు.

బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా..

బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా..

పెళ్లి అంటే సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ అయ్యింది. సాయి శ్రీయ వివాహం అశోక్‌తో ఈ నెల 14వ తేదీన జరిగింది. వరుడికి వధువు స్వాగతం పలుకుతూ ఓ పాటకు చిందులేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాట తెలంగాణ మాండలీకంలో అద్భుతంగా ఉంది. ఆ పాటకు వధువు చక్కగా డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట పెళ్లి కూతురు స్వయంగా పాట పాడి డ్యాన్స్ చేసింది. వధువు డ్యాన్స్‌ను కాసేపు నవ్వుతూ చూసిన వరుడు ఆ తర్వాత తను కూడా కాలు కదిపాడు. వధువుతో కలిసి డాన్స్ చేసి ఆ తర్వాత ఆగిపోయాడు. ఆ వధువు మాత్రం దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఆ పాటకు డాన్స్ చేస్తూనే ఉంది. వదువు డాన్స్‌ను వరుడు తాపీగా నిలబడి ఎంజాయ్ చేయసాగాడు. చివరలో బంధువులు, స్నేహితులు కూడా వధువుతో కలిసి డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అల్లారుముద్దుగా పెరిగా..

అల్లారుముద్దుగా పెరిగా..

నా కాబోయే శ్రీవారూ, నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పద అంటూ సరదాగా మొదలయ్యే ఆ పాటలో ఎక్కువగా వధువు గురించే ఉంది. అల్లారుముద్దుగా పెరిగినట్టు, తనను ఎక్కువగా గారాబం చేసి పెంచినట్టుగా వరుడితో వధువు చెప్పుకుంటోంది. పువ్వులా పెరిగాను అయినా నీ చేయి పట్టుకోవడానికి వస్తున్నా అంటూ ఆ పాట సాగుతుంది. మీ అమ్మానాన్నల్ని మా అమ్మానాన్నల్లాగే చూసుకుంటా అంటూ బంధాల గురించి ఆ పాటలో చరణాలు ఉన్నాయి. అందుకే నెట్టింట యూత్‌కు తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాయి శ్రీయ డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత పేరు, వివరాలు తెలియడంతో ప్రతీ ఒక్కరూ దానినే షేర్ చేస్తున్నారు. అందరూ ఆశీర్వాదం కూడా అందజేస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా బతుకు అంటూ బ్లెస్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట కరోనా సమయంలో లక్షలాది మంది నుంచి మనస్పూర్తిగా బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి సాయి శ్రీయ చిందులేశారు. అదే విధంగా రియాక్ట్ అయ్యారు.

Recommended Video

    Megastar Chiranjeevi ఇండియన్ సినిమాకి ‘బ్రేక్‌ డ్యాన్స్‌' పరిచయం చేసిన స్టార్ || Oneindia Telugu
     రెండోసారి అదే రియాక్షన్

    రెండోసారి అదే రియాక్షన్

    ఒకసారి చేసిన పాటకే జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మరోసారి సాయి శ్రీయ డ్యాన్స్ చేశారు. సెకండ్ పాటకు అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. దానిని అందరూ లైక్ చేసి.. షేర్ చేసి మరింత ఊపును తీసుకొస్తున్నారు. సాయి శ్రీయ బీటెక్ చేసిన సంగతి తెలిసిందే. విప్రో కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త అశోక్.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్.. వీరి పెళ్లి బారత్ డ్యాన్స్ కాస్త వైరల్ కావడంతో.. సెలబ్రిటీ కపుల్‌గా మారిపోయారు. వీరిద్దరూ ఇటీవల వేములవాడ రాజన్నను కూడా దర్శించుకున్నారు. ఈ జంట ఎక్కడికి వెళ్లినా.. జనం ఎగబడుతున్నారు. ఫోటో, సెల్పీ కోసం ట్రై చేస్తున్నారు. వీరిద్దరూ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు. వీరికి మాములు క్రేజీ రాలేదు. సినీ తారల మాదిరిగా క్రేజీ ఏర్పడింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+