వెంటరమ్మని వేధింపులు... ప్రియుడిపై ప్రియురాలి ఫిర్యాదు..

హైదరాబాద్ : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కలిసి ఫొటోలు దిగారు. అయితే ప్రేమికుడు డ్రగ్స్‌కు బానిసవడంతో ఆ బంధం చెడింది. యువతి ప్రియుణ్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఇది జీర్ణించుకోలేని ఆ యువకుడు అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఆ బాధ పడలేక యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో ప్రేమికుడు జైలుపాలయ్యాడు.

తొమ్మిదేళ్లుగా పరిచయం

తొమ్మిదేళ్లుగా పరిచయం

ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన యువతి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. 2010లో మహేంద్రహిల్స్‌లో ఉండే స్టీవెన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. సినిమాలు, పార్కులకు వెళ్లినప్పుడు కలిసి ఫోటోలు దిగారు. అయితే ఈ మధ్య కాలంలో స్టీవెన్ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఆ మత్తులో ప్రియురాలిని తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోకపోవడంతో యువతి అతన్ని దూరం పెట్టింది.

 కొంతకాలంగా తీవ్రమైన వేధింపులు

కొంతకాలంగా తీవ్రమైన వేధింపులు

స్టీవెన్ వేధింపులు పెరిగిపోవడంతో భరించలేని యువతి అతన్ని కలవడం మానేసింది. ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. దీంతో రెచ్చిపోయిన స్టీవెన్ ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి ఫుల్లుగా మద్యం తాగి ఆ మత్తులోనే యువతి ఇంటికి వచ్చాడు. ఆమెపై కోపంతో బయట పార్కు చేసిన టూ వీలర్‌ను ధ్వంసం చేశాడు. యువతి తలిదండ్రులు కోప్పడటంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన స్టీవెన్.. ఆ తర్వాత ఫోన్‌లో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తన నెంబర్ బ్లాక్ చేయడంతో ఇతరుల ఫోన్‌ల నుంచి కాల్ చేస్తూ అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతూ మానసికంగా హింసించాడు.

సోషల్ మీడియాలో ఫోటోలు పెడతానని బెదిరింపు

సోషల్ మీడియాలో ఫోటోలు పెడతానని బెదిరింపు

గత కొన్ని రోజులుగా స్టీవెన్ వేధింపులు శృతిమించాయి. తనతో మాట్లాడకపోతే... తాను చెప్పిన దగ్గరికి రాకపోతే గతంలో తాము కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఇక లాభంలేదనుకున్న యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనను వేధిస్తున్న స్టీవెన్‌పై కంప్లైంట్ చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు యువకున్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+