• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గవర్నర్‌ తమిళసై తో చిరంజీవి భేటీ: ఆసక్తి కర చర్చ :సైరా చూడాలని ఆహ్వానం..!

|

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. గవర్నర్‌కు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. తన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి చూడాలని గవర్నర్‌ను చిరంజీవి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి మధ్య సినిమా గురించి ఆసక్తి కర చర్చ సాగినట్లు సమాచారం. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి తిరిగి సినిమాలో నటించటం..

ఫాలోయింగ్ చెక్కు చెదరకపోవటం పైన గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేసారని విశ్వసనీయ సమాచారం. అదే విధంగా సైరా సినిమా ప్రత్యేకతలను సైతం చిరంజీవి గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. గవర్నర్ సైతం చిరంజీవి సినీ లైఫ్ గురించి ఆసక్తిగా ప్రశ్నలు వేసారని సమాచారం. అదే విధంగా తాను చెన్నైలో ఉన్న సమయంలో నాటి విషయాలను..తమిళనాడుతో తనకు ఉన్న సంబంధాలను చిరంజీవి వివరించారు. తాను నటించిన తాజా చిత్రం చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాగా చిరంజీవి చెప్పుకొచ్చారు. సైరా నరసింహా రెడ్డి చూడాలంటూ మరో సారి చిరంజీవి ఆహ్వానించగా ..గవర్నర్ సైతం వెంటనే అంగీకరించారు. తప్పకుండా సినిమా చూస్తానంటూ బదులిచ్చారు. త్వరలోనే సినిమా చూస్తానని గవర్నర్ చెప్పారు.

cine Hero chiranjeevi met Governor Tails soundar Rajan in Raj Bhavan..invited her to watch Syra movie

కాగా, గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2న విడుదల అయిన సైరా నరసింహా రెడ్డి సినిమా ఇప్పటికే హిట్ టాక్ తో సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుండి మంచి మంచి స్పందన రావడంతో మూడు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సమాచారం.

cine Hero chiranjeevi met Governor Tails soundar Rajan in Raj Bhavan..invited her to watch Syra movie

దసరా పండుగ సెలవులు ఉండటంతో వసూళ్లు మున్ముందు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమా హిట్‌ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే మెగా కుటుంబలోనూ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కాగా, తాజాగా గవర్నర్ తో చిరంజీవి భేటీ అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
cine Hero chiranjeevi met Governor Tailsy soundar Rajan in Raj Bhavan. Chiranjeevi greeted her on the occassion of Dasarah festival. He invited governor to watch Syra movie and governor agreed for that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more