నిలకడగా సీఎం కేసీఆర్ ఆరోగ్యం: డాక్టర్ ఎంవీ రావు
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకింది. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్‌కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. కన్ఫర్మేషన్ కోసం ఆర్టీపీసీఆర్‌కు శాంపిల్స్ పంపించామన్నారు. ఈ రాత్రి 1 గంట వరకు రిపోర్ట్స్ రావొచ్చని చెప్పారు. ప్రస్తుతం పల్స్, బ్లడ్ ప్రెజర్, ఆక్సిజన్ శాతం బాగానే ఉన్నాయని తెలిపారు.

Recommended Video
జ్వరం తగ్గిందని, కొంచెం జలుబు ఉందని పేర్కొన్నారు. లక్షణాలను బట్టి మైల్డ్ కోవిడ్ అని చెప్పొచ్చు. హోం ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పడంతో ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు. వైద్య బృందం కేసీఆర్ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోంది అని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications