హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదాల‌కు నిల‌యంగా "గీతా ఆర్ట్స్‌"

|
Google Oneindia TeluguNews

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న గీతా ఆర్ట్స్ వివాదాల‌కు నిల‌యంగా మారుతోంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ కాకుండా జీఏ2 బ్యాన‌ర్‌పై మీడియం బ‌డ్జెట్ చిత్రాల‌ను కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. వీటిని బ‌న్నీ వాసు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇత‌నిపై కొంత‌కాలం నుంచి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా నిన్న గీతా ఆర్ట్స్ కార్యాల‌యం ఎదుట ఒక మ‌హిళ న‌గ్నంగా ధ‌ర్నాకు దిగిన సంగ‌తి తెలిసిందే.

సునీత‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించిన పోలీసులు

సునీత‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించిన పోలీసులు

జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని గీతా ఆర్ట్స్ కార్యాల‌యం ఎదుట బోయ సునీత అనే యువ‌తి ఒంటిపై ఉన్న దుస్తుల‌న్నీ విప్పేసి నిర‌స‌న తెలియ‌జేస్తుండ‌గా స‌మాచారం అందుకున్న పోలీసులు ఆమెకు దుస్తులు తొడిగి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆమెపై మాన‌సిక స్థితి చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

మంగ‌ళ‌గిరిలో జ‌న‌సేన కార్యాల‌యం ఎదుట‌

మంగ‌ళ‌గిరిలో జ‌న‌సేన కార్యాల‌యం ఎదుట‌

బోయ సునీత మూడునెల‌ల క్రితం మంగ‌ళ‌గిరికి స‌మీపంలోని జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ఎదుట కూడా ధ‌ర్నాకు దిగింది. బ‌న్నీ వాసు త‌న‌కు సినిమాలో అవ‌కాశాలిప్పిస్తాన‌ని చెప్పి అవ‌స‌రాలు తీర్చుకున్నార‌ని, జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తే పార్టీలో మంచి ప‌ద‌వి ఇప్పిస్తాన‌ని చెప్పార‌ని, అవ‌స‌రం తీరిన త‌ర్వాత తానెవ‌రో తెలియ‌దంటూ బ‌య‌ట‌కు గెంటేశార‌ని ఆరోపించారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ అయితే త‌న‌కు న్యాయం చేస్తార‌న్న న‌మ్మ‌కంతో మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చిన‌ట్లు మీడియాకు చెప్పారు. ఆరోజు కార్యాల‌యంలో ప‌వ‌న్ లేక‌పోవ‌డంతో మంగ‌ళ‌గిరి పోలీసులు ఆమెను అక్క‌డి నుంచి పంపించి వేశారు. తిరిగి సోమ‌వారం మ‌ళ్లీ జూబ్లీహిల్స్ లో ధ‌ర్నాకు దిగింది.

బ‌న్నీవాసుపై ఆరోప‌ణ‌లు

బ‌న్నీవాసుపై ఆరోప‌ణ‌లు

బ‌న్నీ వాసుపై సునీత‌కు సంబంధించిన ఆరోప‌ణ‌లే కాకుండా మ‌రికొన్ని కూడా ఉన్నాయ‌ని హైద‌రాబాద్ కృష్ణ‌న‌గ‌ర్ లో నివ‌సించే జూనియ‌ర్ ఆర్టిస్టులు చెబుతున్నారు. ఇత‌ని వ్య‌వ‌హార‌శైలి కూడా వివాదాస్ప‌దంగా ఉంటుంద‌ని, గీతా ఆర్ట్స్ అధినేతలు బాధ్య‌త‌ల‌న్నీ ఇత‌నికి అప్ప‌జెప్ప‌డంతో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, సునీత విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చిందికానీ బ‌య‌ట‌కు రాని విష‌యాలెన్నో ఉన్నాయ‌ని తెలిపారు. ఒక మంచి సంస్థ‌గా పేరుతెచ్చుకున్న గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ‌కు ఇటువంటి వ్య‌క్తుల‌వ‌ల్ల చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని చెప్పారు.

English summary
Geeta Arts becoming home to controversy..వివాదాలకు నిలయంగా మారుతున్న గీతా ఆర్ట్స్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X