షర్మిల పోలీసులను కొట్టటంపై స్పందించిన సీపీ; పీఎస్ లో షర్మిలకు భర్త అనిల్ పరామర్శ!!
పోలీసులపై దురుసుగా ప్రవర్తించటంతో వైయస్ షర్మిల ను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ కు ఆమెను తరలించిన విషయం తెలిసిందే. దీంతో వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పరామర్శించారు.
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన ఆయన ఈరోజు ఉదయం అసలు ఏం జరిగింది అన్న విషయాలను షర్మిలను అడిగి తెలుసుకున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సిట్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసుల తీరును, పోలీసుల తోపులాట సందర్భంగా తనకు తగిలిన గాయాలను ఆమె భర్తకు చూపించారు. ప్రస్తుతం వైయస్ షర్మిల జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు.

ఇదిలా ఉంటే వైయస్ షర్మిల పోలీసులను కొట్టడం పై పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందించారు. షర్మిల సచివాలయానికి వెళతారని తమ వద్ద సమాచారం ఉందని, అందుకే ఆమెను పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. పోలీసులపై అనుచితంగా ప్రవర్తించిన కారణంగా, ఎస్సై ఫిర్యాదు మేరకు షర్మిల కేసు విషయంలో ముందుకు వెళ్తామని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు.
కాగా అంతకుముందు సిట్ అధికారులను కలవడానికి వెళుతున్నానని పేర్కొన్న షర్మిలను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో వైయస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై మండిపడిన వైఎస్ షర్మిల పోలీసులకు పని లేకపోతే గాడిదలు కాసుకోవాలని వ్యాఖ్యానించారు. దీనికి పోలీసులు తాము అదే పనిచేస్తున్నామని వైయస్ షర్మిల కు కౌంటర్ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ షర్మిల గారినీ పరామర్శించిన బ్రదర్ అనిల్ కుమార్ గారు..!!#YSSharmila #Anil #YSRTP #Oneindiatelugu pic.twitter.com/0IstylfB5b
— oneindiatelugu (@oneindiatelugu) April 24, 2023
ఒక మహిళను, పురుష పోలీసులు ఏవిధంగా అడ్డుకుంటారని వైయస్ షర్మిల వారిని ప్రశ్నించారు. ఆపై వాహనంలో వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వాహనానికి అడ్డుపడ్డారు. అనంతరం వాహనం దిగిన వైఎస్ షర్మిల పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, వారిపై చేయి చేసుకున్నారు. పోలీసులను కొట్టటంపై ఆత్మరక్షణ తన బాధ్యత అంటూ ఆపై వైయస్ షర్మిల చెప్పారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications