హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెరిగిన క్రైమ్ రేట్, 50 శాతం మందికి శిక్షలు..2021 పోలీస్ ఆన్యువల్ రిపోర్ట్

|
Google Oneindia TeluguNews

ఏడాదిలో జరిగిన నేరాలు, కేసులకు సంబంధించి పోలీసు శాఖ వార్షిక రిపోర్టును డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 4.56 క్రైమ్ రేట్ పెరిగిందని వివరించారు. నేరం చేసిన వారికి 50.03 శాతం శిక్షలు పడేలా చేశామన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో ప్రజల వెంట పోలీసు శాఖ అండగా ఉందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కోవిడ్ వారియర్స్‌గా పని చేశామన్నారు. 2021లో తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందని వివరించారు.

సక్సెస్..

సక్సెస్..

శాంతిభద్రతల పరిరక్షణ కోసం, మావోయిస్టు రాష్ట్ర రహితంగా చేయడంలో పోలీసు శాఖ సక్సెస్ అయ్యిందని చెప్పారు. మావోయిస్టులు అడుగు పెట్టకుండా కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. 98 మావోయిస్టులను అరెస్ట్ చేశామని, 133 మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు. 8 ఫైర్ ఆమ్స్ క్యాష్ మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నామని.. కమ్యునల్ ఇష్యూస్ లేకుండా చేశామన్నారు. బైంసాలో చిన్న ఘటన తప్ప ఎక్కడ మేజర్ ఘటనలు జరగలేదని చెప్పారు.

నిమిషాల్లో స్పందన

నిమిషాల్లో స్పందన

లైఫ్ కన్వెక్షన్స్‌, డెత్ కన్వెక్షన్స్ పడేలా చేశామని తెలిపారు. 11 లక్షల 100 కాల్స్ రాగా.. 7 నిమిషాల్లో స్పందించామన్నారు. మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పీఠ వేసినట్లు, 5145 ఫిర్యాదులు షీ టీమ్స్ కు వచ్చినట్లు తెలిపారు. సోషల్ మీడియాను పోలీస్ శాఖ యూజ్ చేసుకుందనన్నారు. మీ సేవ ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకున్నామని.. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు.

Recommended Video

COVID Vaccine పై NTAGI సంచలనం... Covishield తొలి, రెండో డోసుకు 12- 16 వారాల గ్యాప్| Oneindia Telugu
అవగాహన

అవగాహన

55 లక్షల మందికి సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించామన్నారు. 6.5 లక్షల మందిని కళాబృందాల ద్వారా జాగృతి పరిచామని, సీసీటీవీ కెమెరాల ద్వారా అనేక కేసులను గుర్తించామని తెలిపారు. రాష్ట్రానికి గంజాయి పెద్ద సమస్యగా మారిందని, గంజాయి వల్లే కేసులు నమోదు అవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ - డ్రగ్ అరికట్టే విషయంలో దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. నూతన టెక్నాలజీతో 25 వేల సైబర్ క్రైమ్ కేసులను డిటెక్ట్ చేయగలిగామని పేర్కొన్నారు. 11 జాతీయ- అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని వివరించారు.

English summary
crime rate is increased in the state telangana dgp mahender reddy said. he revealed 2021 police annual report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X