Viral Video: ఇయర్ బడ్సా.. హెల్మెటా.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది..
చాలా మందికి ద్విచక్ర వాహనంపై వెళ్తునప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం ఇష్టముండదు. చాలా మంది ఫైన్ పడుతుందన్న భయంతో హెల్మెట్ పెట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం జరిమానా విధించినా మారారు. ఇంకొందరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాం, ఇయర్ బడ్స్ పెట్టుకోవాలంటే హెల్మెంట్ పెట్టుకోమని చెబుతారు.
హెల్మెట్ ప్రాముఖ్యతలు చాలా ఘటనలు మన కళ్లకు కట్టాయి. హెల్మెంట్ లేకు చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. అందుకే అందురు హెల్మెంట్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో విడుదల చేశారు.

ఈ వీడియోలో ఓ వ్యక్తి ఆఫీస్ వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. ద్విచక్రవాహనంపై బయల్దేరడానికి సిద్ధమవుతాడు. హెల్మెట్ కూడా తీసుకుంటాడు. కానీ ఇయర్ బడ్స్ ఉండడం వల్ల హెల్మెట్ పక్కకు పెడతాడు. ఆ తర్వాత ఆఫీస్ కు బయల్దేరుతాడు. అయితే మార్గ మధ్యలో అతనికి యాక్సిడెంట్ అవుతుంది.
Some mistakes shouldn't be done even once.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 14, 2022
Wear Helmet. Be Safe.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/xlM5hbV5ta
అతను చనిపోతాడు. అతను హెల్మెట్ పెట్టుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడేవాడు. కానీ ఇయర్ బడ్స్ కోసం హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోతారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వీడియోతో పాటు కొన్ని తప్పులను ఒక్కసారి కూడా చేయకండి అని రాసుకొచ్చారు. హెల్మెట్ ధరించండి. సెఫ్ గా ఉండండి అని రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications