హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాస్కు ధరించని వారిని గుర్తించడానికి తెలంగాణ పోలీసుల సరికొత్త ప్రయోగం: దేశంలోనే తొలిసారిగా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ప్రభుత్వం మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్కులను ధరించని వారిపై వెయ్యి రూపాయల జరిమానాలను సైతం విధిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయినప్పటికీ.. మాస్కులను ధరించడం గానీ, కర్చీఫ్‌ను గానీ కట్టుకోకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు స్థానికులు. మద్యం కొనుగోళ్లకు అనుమతులు ఇచ్చిన ఈ పరిస్థితి మరింత తీవ్రతరమైంది. మాస్కులు ధరించకుండానే మద్యం షాపుల ముందు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.

కరోనా భయంలోనూ రాత్రంతా రోడ్ల మీదే బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం.. కారణం?కరోనా భయంలోనూ రాత్రంతా రోడ్ల మీదే బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం.. కారణం?

సీసీటీవీ కెమెరాల్లో డీప్ లెర్నింగ్ టెక్నిక్..

సీసీటీవీ కెమెరాల్లో డీప్ లెర్నింగ్ టెక్నిక్..

ఈ పరిస్థితిని అధిగమించడానికి సరికొత్త ప్రయోగానికి పూనుకున్నారు తెలంగాణ పోలీసులు. డీప్ లెర్నింగ్ టెక్నిక్‌ను అనుసరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్వైలెన్స్ సీసీటీవీ కెమెరాల్లో ఈ టెక్నిక్‌ను ప్రవేశ పెట్టారు. ఫలితంగా రోడ్ల మీద తిరిగే వారి ముఖం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వారు మాస్కులను ధరించారా? లేదా? అనేది తేలిపోతుంది. మాస్కులను ధరించని వారి వివరాలను సేకరించడానికి ఈ విధానం ఉపయోపడుతుందని తెలంగాణ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో..


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో పని చేస్తుందీ డీప్ లెర్నింగ్ టెక్నిక్. జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా పెద్దగా ప్రజలు తిరుగాడని ప్రాంతాల్లోనూ దీన్ని వినియోగించవచ్చు. ఏ ప్రాంతంలో అధిక సంఖ్యలో ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతున్నారనే విషయాన్ని ఈ విధానం ద్వారా నిర్ధారించడానికి వీలు కలుగుతుంది. ఫలితంగా- సదరు ప్రదేశానికి పోలీసులు పంపి.. మాస్కులు ధరించిన వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.

తొలిదశలో మూడు కమిషనరేట్ల పరిధిలో..

తొలిదశలో మూడు కమిషనరేట్ల పరిధిలో..

డీప్ లెర్నింగ్ టెక్నిక్‌ను సీసీటీవీ కెమెరాల్లో ప్రవేశపెట్టే విధానాన్ని తొలిదశలో మూడు కమిషనరేట్ల పరిధిలో అమల్లోకి తీసుకుని రానున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ తరహా విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. అనంతరం క్రమంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో వాటిని ప్రవేశపెడతారు. డీప్ లెర్నింగ్ టెక్నిక్‌తో ప్రజలు మాస్కులను ధరించారా? లేదా? అనే విధానాన్ని అనుసరిస్తోన్న తొలి రాష్ట్రం తెలంగాణే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రూ.1000 ఫైన్..

రూ.1000 ఫైన్..

తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ మాస్క్‌లను ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా రోడ్ల మీద తిరుగాడితే.. 1000 రూపాయల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని చేర్చింది. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదివరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాస్క్ లేకుండా బయట తిరిగే వారికి కామారెడ్డిలో 500 రూపాయల ఫైన్‌ను విధించారు. ఈ మొత్తాన్ని పెంచాల్సి 1000కి ఉంటుంది.

English summary
Hyderabad, Cyberabad and Rachakonda Police Commissioners was implemented Artificial Intelligence based Face Mask Violation Enforcement is being rolled out by Telangana police. Leveraging Computer Vision and Deep Learning Technique being implemented on surveillance CCTVs across the cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X