టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య: కీలకంగా మారిన ఆ వీడియో, అందులో ఏముంది?
హైదరాబాద్: వర్ధమాన టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన నాగ ఝాన్సీ(21) పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జుననగర్ సాయిరాం రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఆమె బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన సూర్య అనే స్నేహితుడితో ఝాన్సీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
నాలుగైదు రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉందని సోదరుడు దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం రాత్రి సోదరుడు... ఝాన్సీ ఇంటికి వచ్చాడు. తలుపు తెరవలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలకు ప్రవేశించారు. ఆమె ఉరివేసుకుని ఉంది. సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఝాన్సీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మహత్యకు ముందు సూర్యతో ఝాన్సీ చాటింగ్
ఆత్మహత్యకు ముందు సూర్యతో ఝాన్సీ ఛాటింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సూర్య వల్లే తన కూతురు చనిపోయిందని ఝాన్సీ తల్లి ఆరోపించారు. ఝాన్సీని పెళ్లి చేసుకుంటానని సూర్య తనతో తరుచూ చెప్పేవాడన్నారు. తన కుమార్తెకు సూర్యపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సెల్ఫీ వీడియో కీలకం
ఆత్మహత్యకు గల కారణాలపై బుల్లితెర నటి ఝాన్సీ సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సెల్ఫీ వీడియో కీలకంగా మారింది. అందులో ఏముందో తెలిస్తే ఝాన్సీ ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశముంది. అయితే ఈ వీడియో విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఝాన్సీ ప్రేమ వ్యవహారంపై బంధువులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రేమ విషయం తెలియదని కొందరు అంటుంటే, మరికొందరు ఆమె ప్రేమించిన మాట వాస్తవమేనని చెబుతున్నారు. ఈ విషయమై తరచూ గొడవలు జరిగేవని, దీంతో ఝాన్సీ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అంటున్నారు.

అపార్టుమెంటులో ఆత్మహత్య
శ్రీనగర్ కాలనీలో వర్ధమాన సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో ఝాన్సీ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం అనే సీరియల్‌లో ఝాన్సీ నటించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications