దెయ్యాలు వదిలిస్తానన్న ఫాస్టర్.. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ఏమన్నారంటే..! (వీడియో)
హైదరాబాద్ : మనం ఉంది 21వ శతాబ్దంలో.. శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచం దూసుకెళ్తుంది. కానీ మూఢ నమ్మకాలు మాత్రం వీడటం లేదు. ఎక్కడో ఓ చోట దెయ్యాలు, భూతాల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. భూత వైద్యులని, పాస్టార్లు .. దెయ్యాలు వదిలిస్తామని చెప్తున్నారు. అయితే వీరిని కొందరు జనం నమ్మడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నమ్మించి ..
పక్క వీడియోలో ఉంది పాస్టార్లు. మేడ్చల్ జిల్లా కాచవాని సింగారంలో హోలి స్పిరిట్ ప్యారడైజ్ ఫైర్‌కు చెందిన పాస్టార్లు జెరూసలెం మత్తయ్య, బ్రదర్ సాలెమాన్. వీరు ప్రార్థనలు చేయిస్తే ఏం పర్లేదు. కానీ దెయ్యాలు వదిలిస్తామని చెప్పారు. అంతేకాదు జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులతో ఛాలెంజ్ చేశారు. దీంతో టీ రమేశ్ బృందం మంగళవారం అమవాస్య రోజున చర్చ్ వద్దకొచ్చారు. అయితే చర్చ్‌లో అసలు గొడవ మొదలైంది. దెయ్యం వదిలించాలని కోరితే .. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. వాగ్వివాదాలతో ఆ ప్రాంతం పెక్కుటిల్లింది.

మాయమాటలు ...
అమావాస్య రోజున ప్రత్యేక ప్రార్థనలు చేసి బాణామతి, చేతబడులను నయం చేస్తామని పాస్టార్లు సవాల్ చేయడంతో .. రమేశ్ బృందం రంగంలోకి దిగింది. కానీ కొందరినీ హిప్నటైజ్ చేస్తున్నారని రమేశ్ ఆరోపించారు. ఏదో సౌండ్ పెట్టి వారిని లోబరచుకున్నారని .. దెయ్యాలు, భూతాలను వదిలిస్తామని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పాస్లార్లపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అక్కడున్న ఐదుగురు కన్వర్షన్ సైకాలజికల్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వారిని వెంటనే ఎర్రగడ్డ మానసిక వైద్యశాలతో చేర్చించాలని కోరారు.

ప్లీజ్ .. నమ్మొద్దు ...
జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు, పాస్టార్ల వాదనలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మొహరించారు. పాస్టార్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రమేశ్ ఆరోపించారు. దెయ్యాలు, భూతాల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు అమాయక జనాలను చీట్ చేసేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటారని .. వారి ట్రాప్‌లో పడొద్దని సూచించారు.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications