హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డయాలసిసో రామచంద్రా.. కొత్త రోగులకు దొరకని సర్వీస్, అలా అయితేనే సేవ..

|
Google Oneindia TeluguNews

అసలే కరోనా.. అపై ఒమిక్రాన్ టెన్షన్... అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఈ లోపు.. రెగ్యులర్ డిసీజ్ హృద్రోగ, లివర్, క్యాన్సర్ వ్యాధులు ఉండనే ఉన్నాయి. అయితే కిడ్నీ వ్యాధి కూడా టెన్షన్ పెట్టిస్తోంది. మూత్రపిండాల వ్యాధి సోకిన వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. ఎలా అంటే సరయిన కిడ్నీ దొరకదు.. దీంతో డయాలసిస్ తప్ప మరో మార్గం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీ రోగులు నానాటికీ పెరిగిపోతున్నారు. వీరికి తగిన డయాలసిస్ ఇచ్చే సౌకర్యం లేదు. దీంతో వారి బాధ వర్ణణాతీతం.

పదేళ్ల నుంచి

పదేళ్ల నుంచి

ఎల్బీనగర్‌లో గల ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో 14 డయాలసిస్‌ యూనిట్లు ఉన్నాయి. ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు పని చేస్తుంటాయి. ఆరోగ్యశ్రీ కింద రోజుకు 25 మంది వరకు డయాలసిస్‌ చేస్తుంటారు. అక్కడ డయాలసిస్‌ బెడ్‌ కావాలని అడిగితే కనీసం రెండేళ్ల వరకు పడుతుందని చెబుతున్నారు. గత పదేళ్లుగా డయాలసిస్‌ చేయించుకునేవారు ఉన్నారని, షెడ్యూల్‌ ప్రకారం వారికే చేయాల్సిందిగా నిబంధనలు చెబుతున్నాయని, తామేమీ చేయలేమని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. ఉన్నవారిలో ఎవరైనా కిడ్నీ మార్పిడి చేయించుకోవడమో, చనిపోవడమో జరిగితే తప్ప కొత్త వారికి పడకలు ఇచ్చే పరిస్థితి లేదు.

దొరకని డయాలసిస్ బెడ్

దొరకని డయాలసిస్ బెడ్


రాష్ట్రంలోని కిడ్నీ రోగుల దుస్థితి ఇదీ. కొందరు రోజులు, నెలల తరబడి డయాలసిస్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా బెడ్‌ దొరకని పరిస్థితి నెలకొంది. కొవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ బెడ్స్‌.. ఒకటి రెండు రోజుల తర్వాత అయినా దొరికాయి. కిడ్నీ రోగులకు మాత్రం డయాలసిస్‌ బెడ్స్‌ దొరకాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిందే. రాష్ట్రంలో ఏటా కొత్తగా 3 వేల మంది కిడ్నీ ఫెయిల్యూర్‌కు గురవుతున్నారు. ఇప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్‌ అయినవారు.. ఆయా కేంద్రాల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఉన్నరోగులు తగ్గకపోగా, కొత్త రోగులు పుట్టుకొస్తున్నారు. దీంతో డయాలసిస్‌ కేంద్రాలు సరిపోవడం లేదు. పాతవారికి రక్తశుద్ధి చేస్తూనే.. కొత్త రోగులకు కూడా సేవలందించాల్సి వస్తోంది. కిడ్నీ ఫెయిల్యూర్‌ రోగులకు వారానికి కనీసం రెండుసార్లు రక్తం శుద్ధి చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆ కేంద్రాల్లో వారికి షెడ్యూల్‌ స్లాట్‌ ఇస్తారు. దాని ప్రకారం వారు డయాలసిస్‌ కేంద్రాలకు వెళుతుంటారు. ఉన్న కేంద్రాలన్నింట్లో ఇప్పటికే షెడ్యూల్‌ స్లాట్స్‌ బుక్‌ అయిపోయాయని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా కిడ్నీ ఫెయిల్యూర్‌ రోగి వస్తే బెడ్‌ ఇవ్వలేని పరిస్థితి.

అప్పుడే 5500 మంది రోగులు

అప్పుడే 5500 మంది రోగులు


రాష్ట్రం ఏర్పడే సమయానికి తెలంగాణలో 5500 మంది డయాలసిస్‌ రోగులు ఉండేవారు. 2017లో కొత్తగా రక్తశుద్ధి కేంద్రాలను ప్రారంభించింది. నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించారు. నిమ్స్‌ పరిధిలో 16 కేంద్రాల్లో 85 డయాలసిస్‌ మెషిన్లు, గాంధీ పరిధిలో 13 కేంద్రాల్లో 94 మెషిన్లు, ఉస్మానియా పరిధిలో 10 కేంద్రాల్లో 73 మెషిన్ల చొప్పున మొత్తం 39 కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. 2017 డిసెంబరు నాటికి కేవలం 12 రక్తశుద్ధి కేంద్రాలే పని చేశాయి. ఆ తరువాత దశలవారీగా మిగిలిన 27 కేంద్రాల్లో డయాలసిస్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత రోగుల సంఖ్య పెరిగిపోవడంతో డయాలసిస్‌ కేంద్రాల సంఖ్యను పెంచింది. 46 కేంద్రాల్లో డయాలసిస్‌ సేవలు అందుతున్నాయి. ప్రతి నెలా 28 వేల డయాలసిస్‌ సెషన్స్‌ చేస్తున్నారు. 73 ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్‌ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. రెండింటిలో కలిపి రోజుకు పది వేల మందికి డయాలసిస్‌ చేస్తున్నారు. ఏటా 7.5 లక్షల డయాలసిస్‌ సెషన్స్‌ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే చేస్తున్నారు.

నెలకు 14 వేల కౌంట్స్

నెలకు 14 వేల కౌంట్స్

2018లో ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాల్లో నెలకు సగటున 14 వేల కౌంట్స్‌ చేసేవా రు. కిడ్నీ వైఫల్యం తీవ్రతను బట్టి రోగులకు వారానికి 2-3 సార్లు డయాలసిస్‌ చేస్తారు. చేసిన ప్రతిసారీ ఒక కౌంట్‌ కింద పరిగణిస్తారు. అలా తొలినాళ్ల లో ప్రభుత్వ కేంద్రాల్లోనే నెలకు 14 వేల కౌంట్స్‌ చేయగా, ప్రస్తుతం అవి 28 వేలకు పెరిగాయి. 2014 నుంచి 2021 నవంబరు 16 వరకు 42,66,079 డయాలసిస్‌ కౌంట్స్‌ చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడేళ్లలో డయాలసిస్‌కు ప్రభుత్వం రూ.575.95 కోట్లు వెచ్చించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కిడ్నీ రోగుల సంఖ్య 11 వేలకు చేరింది. దీంతో ఇప్పుడున్న డయాలసిస్‌ కేంద్రాలు సరిపోవడంలేదు. దీనికితోడు ప్రస్తుత కేంద్రాలు కొందరికి దూరంగా ఉన్నాయి. దీంతో డయాలసిస్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలని స్థానిక ప్రజాప్రతినిధులపై రోగులు ఒత్తిడి తెస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి 30-40 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తులు పెట్టుకున్నారు.

English summary
dialysis centres are shortage in telangana state. new patient not get dialysis in the centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X