అలర్ట్: చర్లపల్లి నుంచి నడవబోతున్న సూపర్ ఫాస్ట్ రైళ్ల జాబితా ఇదే!
ప్రయాణికులు, రైళ్ల రద్దీతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. దీంతో ఈ మూడింటికి ప్రత్యామ్నాయంగా మరో రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేయాలని భావించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు రూ.454 కోట్ల భారీ వ్యయంతో చర్లపల్లి రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు 98 శాతం పనులు పూర్తయి అతి త్వరలోనే ఈ స్టేషన్ అందుబాటులోకి రాబోతోంది. వచ్చేనెలలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీన్ని జాతికి అంకితం చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
25 రైళ్లు నడిపేలా అనుమతి
చర్లపల్లి నుంచి 25 రైళ్లను నడిపిస్తామని, వాటికి అనుమతులు కావాలంటూ ఇక్కడి అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ప్రస్తుతం ఆరు రైళ్లను ఇక్కడి నుంచి నడపడంతోపాటు మరో 12 సూపర్ ఫాస్ట్ రైళ్లను ఇక్కడ ఆపేలా అనుమతులు వచ్చాయి. పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి? పూర్తయిన వెంటనే చర్లపల్లి స్టేషన్ ను ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకురావాలనే విషయాన్ని రైల్వేబోర్డు ఇక్కడి అధికారులకే నిర్ణయాన్ని కట్టబెట్టింది. పూర్తిగా అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి కొత్త టెర్మినల్ ను అందుబాటులోకి తేబోతున్నారు. ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారుబు చెబుతున్నారు. చర్లపల్లి నుంచి నడిచే రైళ్లను అధికారికంగా త్వరలోనే ప్రారంభించబోతున్నారు.

చర్లపల్లి నుంచి ప్రారంభమయ్యే రైళ్లు
12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
12604 హైదరాబాద్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
18046 హైదరాబాద్ - షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
18045 షాలిమార్ - హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
12589/12590 గోరఖ్‌పూర్ - సికింద్రాబాద్ - గోరఖ్ పూర్
చర్లపల్లిలో ఆగే రైళ్లు
17233/17234 సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
12713/123714 విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్
12757/12758 సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
12705/12706 గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్
17011/17012 హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
17201/17202 గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్












Click it and Unblock the Notifications