గుడ్ న్యూస్.. 2వ విడతకు ఆర్థికశాఖ ఆమోదం.. ఇవే ఆ కొలువులు.. వయోపరిమితి కూడా పెంపు

రాష్ట్రంలో 80 వేల పైచిలుకు కొలువులు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే తొలి విడత జాబ్స్ నోటిఫికేషన్‌కు ఆర్థికశాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రెండో విడ‌త‌లో భాగంగా బుధ‌వారం మ‌రో 3,334 ఉద్యోగాల భ‌ర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు ఆ కొలువులకు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

రెండో విడ‌త‌లో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వాటిలో ఎక్సైజ్‌, ఫారెస్ట్‌, అగ్ని మాప‌క శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి ఆర్థికశాఖ అనుమ‌తి ఇచ్చింది. మిగిలిన శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన అనుమ‌తుల‌పై దృష్టి సారించింది. ఆర్థిక శాఖ నుంచి అనుమ‌తి ల‌భించిన ఉద్యోగాల భ‌ర్తీకి త్వ‌ర‌లో నోటిఫికేష‌న్లు జారీ అవుతాయి.

telangana finance minister agree to second phase 3334 jobs.

ఇటు నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగాల భ‌ర్తీ కోసం సిద్ధ‌మ‌వుతున్న నిరుద్యోగుల‌కు వ‌యో ప‌రిమితిని మూడేళ్లు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అన్ని ర‌కాల ఉద్యోగాల‌కు కాకుండా కేవ‌లం యూనిఫాం ఉద్యోగాల‌కు మాత్ర‌మే ఈ వ‌యో ప‌రిమితి పెంపు వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. తెలంగాణ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం పోలీస్‌, ఎక్సైజ్‌, అగ్నిమాప‌క‌, జైళ్లు, అట‌వీ శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగాల‌కు ఈ వ‌యో ప‌రిమితి వ‌ర్తించ‌నుంది.

గరిష్ఠ వ‌యో ప‌రిమితిని మూడేళ్ల‌కు ప్రభుత్వం పెంచింది. వ‌యో ప‌రిమితి స‌డ‌లింపు రెండేళ్ల పాటు అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపింది. దీంతో ఏజ్ బార్ అయిన వారికి వెసులుబాటు కలుగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+