హైదరాబాద్ గన్‌ఫ్రౌండిలో భారీ అగ్నిప్రమాదం... ఒక్కసారిగా చెలరేగిన మంటలు...

హైదరాబాద్‌లోని గన్‌ఫ్రౌండిలో ఉన్న ఓ చెప్పుల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గౌడౌన్‌లోని చెప్పులు,ఫర్నీచర్ ఇతరత్రా సామాగ్రి కాలిబూడిదైంది. మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోడౌన్‌కు సమీపంలోని ఓ హోటల్ కిచెన్‌లో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్షణాల్లోనే గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో... ఫైరింజన్లతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

ప్రస్తుతం రెండు ఫైరింజన్లతో అక్కడ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ... భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలేవీ ఇంకా తెలియరాలేదు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Fire breaks out at footwear godown at gunfoundry in hyderabad

Recommended Video

    #SabarimalaTemple : సరికొత్త నిబంధనలతో.. భక్తుల కోసం తెరుచుకోనున్న Sabarimala ఆలయ తలుపులు!

    రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పరిధిలోని మంకాల్ పారిశ్రామికవాడలోని సరాయివాలా ఆయిల్ పరిశ్రమలోనూ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ రెండేళ్ల క్రితమే మూడపడటంతో ప్రస్తుతం అందులో ఎవరూ పనిచేయడం లేదు. దీంతో అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మంటలు భారీగా ఎగసిపడటంతో చుట్టుపక్కల జనం భయభ్రాంతులకు గురయ్యారు. మహేశ్వరం అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈదురు గాలుల కారణంగా మంటలు మరింత వ్యాపించడంతో అదుపు చేయడం కష్టంగా మారింది. ఎట్టకేలకు కొన్ని గంటల పాటు శ్రమించి అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+