Hyderabad: హైదరాబాద్ నుంచి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం..

జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) 2023 డిసెంబర్ 1 న హైదరాబాద్ నుంచి గోండియాకు విమాన సర్వీసులను ప్రారంభించింది. తొలి ఇండిగో విమానం 6ఈ 7534 హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 10.35 గంటలకు బయలుదేరింది.

ఇండిగో బృందంతో పాటు జీహెచ్ఐఏఎల్ కు చెందిన ఉన్నతాధికారులు ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. రోజువారీ విమానం హైదరాబాద్ నుంచి 10:35 గంటలకు బయలుదేరి 12:35 గంటలకు గోండియా చేరుకుంటుంది. రైస్ సిటీ అని కూడా పిలువబడే గోండియాను ఇండిగో నెట్వర్క్కు చేర్చడం ఎయిర్ లైన్స్ కలిసొచ్చే అంశం.

Flights started from Hyderabad to Gondia

దీనితో ఇండిగో హైదరాబాద్ ను 55 దేశీయ గమ్యస్థానాలకు, 14 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలు నడుపుతోంది. ఇటీవలే శంషాబాద్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.రెండు వారాల క్రితం శంషాబాద్ విమానాశ్రయం నుంచి మరో నాలుగు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

కొచ్చి,గ్వాలియర్,అమృతసర్, లక్నో నగరాలకు ఏ నూతన విమాన సర్వీసులు ప్రారంభించారు. అక్టోబర్ 29, 2023 నుంచి హైదరాబాద్-సింగపూర్ మార్గంలో ఇండిగో సర్వీసులను ప్రారంభించింది. సింగపూర్ వెళ్లే 6ఈ-1027 విమానం హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 2.50 గంటలకు (IST) బయలుదేరి 10:00 గంటలకు (సింగపూర్ స్టాండర్డ్ టైమ్) సింగపూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణానికి 6ఈ-1028 విమానం సింగపూర్ నుంచి 23:25 గంటలకు (సింగపూర్ స్టాండర్డ్ టైమ్) బయలుదేరి 01.30 గంటలకు (IST) హైదరాబాద్ చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+