సీఎం కేసీఆర్‌తో ట్రబుల్ షూటర్ హరీష్ రావు భేటీ.. కారు రివర్స్‌పై చర్చ
తెలంగాణలో కారు జోరు రివర్స్ కావడంతో ఆపార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలోనే చాల రోజుల తర్వాత, ఎన్నికల ట్రబుల్ షూటర్ హారీష్ రావుతోపాటు మాజీ ఎంపీ కవిత, ఇతర నేతలతో ఆయన సమావేశం అయ్యారు.కాగా మూడు గంటలపాటు ఎన్నికల ఓటమీకి గల కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది.
కాగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి హారీష్ రావు పార్టీకి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలలుగా జరుగుతున్న స్థానిక సంస్థలతోపాటు ఎంఎల్‌సీ ఎన్నికల్లో కూడ ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మరోవైపు ఆయన మొదటి ధపాలో మంత్రిపదవి కూడ దక్కలేదు. ఈనేపథ్యంలో కేటీఆర్‌కు పూర్తి బాద్యతలు అప్పగించిన కేసీఆర్ ఎన్నికల సమీక్షలకే పరిమితమయ్యారు..

ఇక హరీష్ అయిదు నెలలుగా పార్టీకి దూరంగా ఉండడంతో ఆయనపై పలు రకాలుగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన చాలసార్లు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడ హరీష్ రావుకు మెదక్ పార్లమెంట్ స్థానం ఇంచార్జీగా అప్పగించారు. దీంతో ఆయన అభ్యర్థిని గెలిపించుకునేందుకు మాత్రమే పరిమితమయ్యారు.దీంతో నిజామాబాద్‌లో గడ్డు పరిస్థితులు ఉన్న సరైన నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో మాజీ ఎంపీ కవిత సీఎం కూతురే స్వయంగా ఓడిపోవడం పార్టీపైన ,కేసీఆర్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇక చాల కాలం తర్వాత హరీష్ రావతో సీఎం భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications