Hyderabad: హైదరాబాద్‍లో డబుల్ డెక్కర్ బస్సులు.. ఉచితంగా ప్రయాణం చేయ్యొచ్చు..!

హైదరాబాద్(Hyderabad)లో డబుల్ డెక్కర్ బస్సులు నడుస్తున్నాయని ఎంత మందికి తెలుసు.. అసలు ఫ్రీగా డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం చేయవచ్చని మీకు తెలుసా..! ఒక్కప్పుడు హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు నడిచేవి. హైదరాబాదీలు ఈ బస్సులు ఎక్కి నగరాన్ని చూట్టొచ్చేవారు. అయితే కాలక్రమేనా డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగయ్యాయి. కొద్ది రోజుల క్రితం పట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ తీసుకొస్తే బాగుటుందని పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

నెటిజన్ల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేటీఆర్.. డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లపైకి తీసుకురావాలని ఆర్టీసీ అధికారులను కోరారు. దీనిపై చర్చించిన ఆర్టీసీ అధికారులు ప్రస్తుతం ఉన్న రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులు నడపడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. పైగా డబుల్ డెక్కర్ ధరలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసి నడపాలని హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. మొదటగా రెండు బస్సులు కొనుగోలు చేసి.. అనంతరం మరో నాలుగు డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేసింది.

Free Double Decker servises in hyderabad

ఈ డబుల్ డెక్కర్ బస్సులను నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ లో రెండు నెలల నుంచి నడుపుతున్నారు. ఈ బస్సులు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు నడుపుతున్నారు. జాయ్ రైడ్ పేరుతో ఉచితంగా తిప్పుతున్నారు. అయితే ఈ బస్సులు ఏ రూట్లలో నడుస్తున్నాయో తెలియక జనలు ఎక్కడం లేదు. అయితే ఇలా నడపడం వల్ల ఖర్చు తప్ప మిగిలేది ఏం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్కో బస్సును రూ.2 కోట్లు పెట్టి కొన్నారు. అంటే రూ.12 కోట్లు ఖర్చు పెట్టి డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేసినా ఫలితం కనిపించడం లేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+