హైదరాబాద్ శివారులో మహిళపై గ్యాంగ్ రేప్..కిడ్నాప్ చేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఆపై...

దేశ వ్యాప్తంగా రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. రోజూ ఏదో ఒక చోట అత్యాచారాలు సభ్య సమాజాన్ని సిగ్గు పడేలా చేస్తున్నాయి. విచక్షణ మరిచి పశువుల్లా మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో .ఇక తాజాగా హైదరాబాద్ శివారులో మరో దారుణం జరిగింది. ఓ మహిళను కిడ్నాప్ చేసిన ముగ్గురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ శివారు నార్సింగి పరిధిలోని పుప్పాలగూడ లో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళితే ఓ మహిళను కిడ్నాప్ చేసిన ముగ్గురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ముగ్గురు దుండగులు మహిళను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. నోట్లో గుడ్డలు పెట్టి అరవకుండా సామూహికంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఇక ఆ తర్వాత ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారో ఏమో కానీ ఆమెను రకరకాలుగా చిత్ర హింసలకు గురి చేశారు. వారి శాడిజం చూపించారు.

Gang rape in hyderabad Suburbs.. three men raped and harassed a woman

వారి చెర నుంచి తప్పించుకుని బయటపడిన మహిళ రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు. ఆమె ద్వారా జరిగింది తెలుసుకుని అత్యాచారానికి పాల్పడిన వారి కోసం వెతికారు.ఇదంతా గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక్క వ్యక్తి మాత్రం వారికి చిక్కాడు. అతడికి దేహశుద్ది చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. అతని ద్వారా మిగతా ఇద్దరి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+