David Sawang: హైదరాబాద్‍లో గౌతం సవాంగ్ కొడుకు హల్‍చల్.. యువకుడిపై దాడి..
ఆంధ్ర ప్రదేశ్ మాజీ డీజీపీ, ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతం సవాంగ్ కొడుకు డేవిడ్ సవాంగ్ హైదరాబాద్ లో హల్చల్ చేశాడు. జూబ్లీహిల్స్ లోని పబ్బు వద్ద దురుసుగా ప్రవర్తించాడు. డేవిడ్ సవాంగ్ ఓ యువకుడిని విచక్షణ రహితంగా చితబాదాడు. ఓ యువతి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బుధవారం రాత్రి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లోని జీ40 పబ్ వద్ద జరిగింది.
ఇరువు వర్గాల ఘర్షణకు దిగాయి. దీనిపై బాధితులు ఎవరు పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. రోడ్డు నంబర్10లో ఉన్న జీరో 40 పబ్‌లో వివాదం జరగడంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు వర్గాలు ఒకరికొకరు నెట్టుకున్నారు.పబ్ పార్కింగ్ ప్రదేశంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. డెవిడ్ సవాంగ్ తన మిత్రులతో కలిసి తమపై దాడి చేశారని యువకులు ఆరోపించారు. తమ అంతు చూస్తామని డెవిడ్ బెదిరించినట్లు బాధుతులు చెబుతున్నారు.

డేవిడ్ సవాంగ్‌తో పాటు మరో ముగ్గురు ఆఫ్రికా యువకులు కూడా తమపై దాడి చేశారని ఆరోపించారు. తాను కుక్కల్ని ఇష్టపడతానని, కరవడానికి వస్తే ఆగేది లేదని డేవిడ్ సవాంగ్ వాట్సాప్ మెసెజీలను బాధితులు చూపించారు. తాను పోలీస్ కేసు పెడితే తన అంతు చూస్తానని హెచ్చరిస్తూ మెసేజీలు పంపాడని బాధితుడు సిద్ధార్థ ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications