ఫ్లాప్ సినిమాకు కేటీఆర్ హడావుడి! బీజేపీలోకి బండ కార్తీక, కాషాయ పార్టీ వైపు కాంగ్రెస్ నేతల చూపు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్‌లో జరిగింది బీజేపీలో జరగదనే.. కార్తీక రెడ్డి..
ఈ సందర్బంగా బండ కార్తీక మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయం బీజేపీలో జరగదనే నమ్మకంతోనే వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇవ్వాల్సిన టికెట్ రెండు సార్లు వేరేవాళ్లకు కేటాయించిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనన్నారు బండ కార్తీకరెడ్డి.

ఫ్లాప్ సినిమాకు కేటీఆర్ హడావుడి.. గ్రేటర్ బీజేపీదే
గ్రేటర్ మేయర్ సీటు బీజేపీదేనని కార్తీక అన్నారు. అట్టర్ ఫ్లాప్ అయ్యే సినిమా కోసం మంత్రి కేటీఆర్ హడావుడి ఎక్కువైందన్నారు. ఓటమి భయంతోనే ఆయన జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు పంక్చర్ కావడం ఖాయమని కార్తీక రెడ్డి వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ సర్కారును తరిమికొట్టడమే లక్ష్యం..
బీజేపీ గ్రేటర్ ఎన్నికల ఇంఛార్జీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమే తమ లక్ష్యం అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల ఎక్కడని పేదలు అడుగుతున్నారని, దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రేటర్ మేయర్ పీఠం తమ పార్టీకే దక్కుతుందని భూపేందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video

బీజేపీ వైపు కాంగ్రెస్ నేతల చూపు.. కీలక నేతలతో చర్చలు
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందడంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు కూడా సానుకూలంగా ఉన్న నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ నివాసాలకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారితో చర్చించినట్లు తెలిసింది. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, దేవిప్రసాద్ నివాసాలకు కూడా బీజేపీ నేతలు వెళ్లి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మరికొందరు నేతుల కూడా బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications