దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.97 శాతం: రజనీకాంత్ ఫ్యామిలీకి రూ.10 లక్షల సాయం: కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు కొనసాగించగా.. సీఎం కేసీఆర్ ఖండించారు. ఇటు రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో దేశం జీడీపీలో మన రాష్ట్రం యొక్క జీఎస్‌డీపీ శాతం 4.06గా ఉండేందని తెలిపారు. గత ఏడు సంవత్సరాల వరుస పెరుగుదలతో దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం వాటా 4.97 శాతం పెరిగిందని వివరించారు.
దేశం యొక్క ప్రగతి రేటు కంటే మన ప్రగతి రేటు ఎక్కువగా ఉందని హరీశ్ రావు వివరించారు. దేశ వృద్ధికి కూడా తెలంగాణ రాష్ట్రం తోడ్పాటును అందిస్తుంది. దేశంలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది. ప్రాథమిక రంగంలో రాష్ట్రం పురోగతి సాధించినట్లు నీతిఆయోగ్ చెప్పిందని తెలిపారు. సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నామని వివరించారు. గొర్రెలు, గేదెల పంపిణీ, డెయిరీ పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ, అనుబంధం రంగాలపై ఏడేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేశామని.. ఆర్థిక సంఘం సిఫార్సులను పట్టించుకోకుండా కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని హరీశ్‌రావు పేర్కొన్నారు

మరోవైపు కొద్ది రోజుల క్రితం మణికొండలోని ఓ డ్రైనేజీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రజనీకాంత్ కొట్టుకుపోయి చనిపోయిన సంగతి తెలిసిందే. శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రజనీకాంత్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రజనీకాంత్ మృతి చెందిన ఘటనకు సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
శాఖపరమైన విచారణకు కూడా ఆదేశించామని తెలిపారు. తమ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం వల్లే ఆ ఘటన జరిగిందన్నారు. ఇందుకు మంత్రిగా తాను బాధ్యత వహిస్తున్నానని.. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కుంభవృష్టి తట్టుకునేలా మున్ముందు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications