Viral Video: మీరు రోడ్డు పైకి వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే..
రోడ్డుపైకి వచ్చామమంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యం వాహనంతో రోడ్డు ఎక్కామంటే దారిపైనే దృష్టి పెట్టాలి. అదే సయంలో లిమిటెడ్ స్పీడ్ లో వెళ్లాలి. మరి ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. కానీ చాలా మంది ట్రాఫిక్ రూల్స్ ఫోలో అవరు. ఇలా చేయడంతో జేబుకు చిల్లు పడడంతో పాటు ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది.

బైక్ ను ఢీకొన్న మరో బైక్..
ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ప్రాణాలు పోతాయా అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓ వ్యక్తి రష్ గా ఉన్న రోడ్డు అప్పొసిట్ డైరెక్షన్ వచ్చాడు. అదే సమయంలో మరో వ్యక్తి చాలా స్పీడ్ సరైన దిశలో వెళ్తున్నాడు. ఇంకెముంది. ఎదురుగా వస్తున్న బైక్ ను గుద్దేశాడు. ఇందులో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అతను ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగింది.

అతివేగం
అయితే ఇక్కడ స్పీడ్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. సరైన దిశలో వస్తున్న వ్యక్తి కూడా ఎక్కువ స్పీడ్ లో వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. "అప్పొసిట్ డైరెక్షన్ లో వెళ్లడం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన మాత్రమే కాదు ఇది చాలా ప్రమాదకరం" అని రాసుకొచ్చారు.
లేట్ అయినా పర్వాలేదు..
సో మీరు రోడ్డు ఎక్కిన ప్రతిసారీ ఇంటిని గుర్తుంచుకోండి. మన ఎదురు చూస్తున్నారని మరిచిపోకండి. యూ టర్న్ కిలో మీటర్ దూరంలో ఉంది. ఎవడు అంత దూరం వెళ్తారని అనుకోకండి. కాస్త లేట్ అయిన పర్వాలేదు. కానీ ఇంటికి భద్రంగా చేరుకోండి.అయితే ఇన్ని ప్రమాదాలు జరిగినా.. చాలా మందిలో మార్పు రావడం లేదు. పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు.












Click it and Unblock the Notifications