భాగ్యనగరంలో భారీ వర్షం.. రాష్రంలో ఇతర చోట్ల కూడా..రెండురోజులు ఎఫెక్ట్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో చోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్టలో రోడ్లు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మ్యాన్ హోళ్లు తెరవగా.. ఆయా చోట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ వైపునకు వెళ్లొద్దని సజెస్ట్ చేస్తున్నారు.
ఇటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం రెండు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల వద్ద ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దాని ప్రభావంతో వర్షం కరుస్తోంది.

ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ మేరకు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉక్కపోత భరించలేని పరిస్థితి నెలకొంది. అక్కడ ఉదయమో, సాయంత్రమో వర్షం పడుతోంది.












Click it and Unblock the Notifications