Hyderabad Rains: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం..!
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం మళ్లీ మొదలైంది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. తాజాగా మంగళవారం సాయంత్రం సిటీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడలో భారీ వర్షం పడింది. భారీ వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మధ్యాహ్నం కాస్త ఉక్కపోతతో పాటు ఎండ కాసింది. కానీ సాయంత్రం కాగానే ఆకాశం మేఘావృతం భారీ వర్షం కురిసింది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో తేలిపాటి జల్లులు పడుతుండగా.. మిగతా ఏరియాల్లో వాతావరణం చల్లగా ఉంది.
దీంతో ఆఫీసుల్లో ఉన్న ఉద్యోగులు ఇంటి బాట పట్టారు. అయితే అందరు ఉద్యోగులు ఒకేసారి బయటకు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. అలా రావడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి,ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

హైదరాబాద్ లో కూడా వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర, వినోభానగర్ కాలనీల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ అయ్యారు. రోడ్లపై నిలిచిన నీటిని సిబ్బందితో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. చాలా చోట్ల రోడ్లపై నీరు ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications