హైదరాబాద్‌లో మళ్లీ మొదలైనభారీ వర్షం..
హైదరాబాద్: మొన్నటివరకు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలను నిలువునా వణికించాయి భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాలు జలమయం అయ్యాయి. ఇప్పటికీ ఈ వరద పోటు నుంచి తేరుకోలేకపోతున్నాయి. అనేక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉంటోన్నాయి. భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల వరంగల్ వంటి నగరం సైతం మునిగిపోయింది.
భారీ వర్షాల ధాటికి ఉత్తర తెలంగాణ జిల్లాలు నిండా మునిగాయి. వరంగల్, ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వరద పోటు అధికంగా కనిపించింది. ఆయా జిల్లాల్లో ఉన్న రిజర్వాయర్లు, చెరువులు, వాగులు.. పొంగి పొర్లాయి. దాదాపు అన్ని రిజర్వాయర్ల గేట్లన్నింటినీ ఎత్తేశారు అధికారులు.

హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు నివాసాల్లో వర్షపునీరు చేరింది. కొండాపూర్, గచ్చీబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి..వంటి ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు మందగించాయి.
సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్ నగర్, తార్నాక, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కుత్బుల్లాపూర్, బోయినపల్లి, బేగంపేట్‌లల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల వల్ల సంభవించిన నష్టాల నుంచి ఇంకా జంటనగరాలు కోలుకోనేలేదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ హైదరాబాద్‌లో వర్షాలు మొదలయ్యాయి.
సికింద్రాబాద్, సనత్‌నగర్, మోతీనగర్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, యూసుఫ్ గూడ, నారాయణ గూడ, బహదూర్ పల్లి, జీడిమెట్ల, జగద్గిరి గుట్ట, సూరారం కాలనీ, మాదాపూర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, రాయదుర్గం, బోరబండ.. ఇలా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షపునీరు చేరుకోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలు స్తంభించాయి.












Click it and Unblock the Notifications