Hyderabad: భారీ వర్షం, పలుచోట్ల వడగళ్లతో చల్లబడిన నగరం
హైదరాబాద్: నగరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. సోమవారం సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేఘావృతమై హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసంది. పలు చోట్లు వడగళ్ల వానలు పడ్డాయి. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నాంపల్లి, హైకోర్టు, గోషామహల్, బేగంబజార్, ఖైరతాబాద్, లక్డీకపూల్, అసెంబ్లీ, తదితర ప్రాంతాల్లో వడగల్ల వర్షం కురిసింది. దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట, కోఠి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీర్‌బాగ్, హైదర్‌గూడ, చంచల్‌గూడ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

ఈ క్రమంలో వివిధ పనులపై బయటకు వెళ్లిన వాహనదారులు, ప్రజలు వర్షంలో తడిసిపోయారు. పలు చోట్ల రహదారులపైకి వర్షం నీరు చేరుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అయితే, మండిపోతున్న ఎండలతో సతమతమవుతున్న నగర ప్రజలకు ఈ వర్షాలతో కొంత ఉపశమనం లభించిందనే చెప్పాలి.
#HyderabadRains : Hailstorms rain witnessed in Himayatnagar and Basheerbagh areas in #Hyderabad pic.twitter.com/EkMJYOGM00
— Anusha Puppala (@anusha_puppala) April 17, 2023












Click it and Unblock the Notifications