హీరో రామ్ చేతుల మీదుగా సీఎంఆర్ షాపింగ్ మాల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
తెలుగు వారి వస్త్రాలయం అంటే గుర్తుకొచ్చేది సీఎంఆర్ షాపింగ్ మాల్. ఎప్పటికప్పుడు ట్రెండ్‌లో ఉన్న ఫ్యాషన్ వేర్‌ను కస్టమర్లకు అందించడంతో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం తమ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ అందించింది. గతంలో చెప్పిన విధంగానే సీఎంఆర్ షాపింగ్ మాల్ కొత్త బ్రాంచ్‌ను బీహెచ్ఈఎల్ (BHEL)లో బుధవారం ఘనంగా ప్రారంభించింది.
టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతులు మీదగా సీఎంఆర్ షాపింగ్ మాల్ కొత్త బ్రాంచ్ ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు రామ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ సీఎంఆర్ షాపింగ్ మాల్ స్టోర్‌ను ప్రారంభించారు. హీరో రామ్ బీహెచ్ఈఎల్ (BHEL) వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు.

సీఎంఆర్ షాపింగ్ మాల్ కొత్త బ్రాంచ్ గ్రాండ్‌గా ఓపెన్ కావడంతో బీహెచ్ఈఎల్ (BHEL)లో ప్రజల సందడి నెలకొంది.మోడ్రన్ ఫ్యాషన్ నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు అన్నీ ఒకే చోట లభ్యమయ్యే విధంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకుంది. షాపింగ్ మాల్ మొదటి రోజే కస్టమర్ల తాకిడి ఎక్కువుగా కనిపించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ బ్రాంచ్‌లు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బీహెచ్ఈఎల్ (BHEL)లో తమ కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది.













Click it and Unblock the Notifications