Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ట్రాఫిక్ సమస్యకు చెక్..!

హైదరాబాద్ వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఉపాధి కోసం ఇక్కడకు వస్తున్నారు. దీంతో వాహనాలు కూడా భారీగా పెరుగుతోన్నాయి. దీంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ పెరుగుతోంది. రోడ్లు చిన్నగా ఉండడం తిరిగే వాహనాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం రోడు వెడల్పు చేయడం లేదా ఫ్లై ఓవర్లు నిర్మించడం చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో అరాంఘర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది.

అలాగే అంబర్ పేటలో కూడా ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కావొస్తోంది. దీంతో పాటు నిలిచిపోయిన ఉప్పల్-నారపల్లి పనులు మళ్లీ మొదలయ్యాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా తాజాగా హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ ఫర్ మేటివ్ ఇన్ ఫ్రాస్టక్చర్ ( హెచ్ సిటీ) ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.5,942 కోట్లు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Huge funds Grant for construction of flyovers and underpasses in Hyderabad

ఈ డబ్బుతో నగరంలో ఫ్లై ఓవర్లు, అండర్​పాస్ లు, రోడ్డు విస్తరణ పనులు చేపట్ట అవకాశం ఉంది. రూ. 758 కోట్లతో ఖైరతాబాద్ జోన్ లోని మెహిదీపట్నంలో ఒకటి, జూబ్లీహిల్స్ లో రెండు చోట్ల ఫ్లై ఓవర్ లు, అండ్ పాస్ లు, రోడ్డు విస్తరణ చేస్తామని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు రూ. 837 కోట్లతో శేరిలింగంపల్లి జోన్ లోని ఖాజాగూడ, త్రిపుల్ ఐటీ, విప్రో సర్కిల్ లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర, మియాపూర్ క్రాస్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు.

కూకుట్ పల్లి జోన్ లో ఫ్లై ఓవర్ లు, సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ లో రోడ్ల విస్తరణకు రూ. 960కోట్లు, ఎల్బీ నగర్ జోన్ లో టీకేఆర్ కాలేజ్ దగ్గర ఫ్లై ఓవర్ , చార్మినార్ జోన్ లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లకు కూడా నిధులు కేటాయించనున్నారు. ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కేబీఆర్ పార్క్ రోడ్డు లో కూడా ఫ్లై ఓవర్లు నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+