Girls Alert: యువతుల గదిలో సీక్రెట్ కెమెరాలు, ఇంటి యజమాని వికృతచేష్టలు
హైదరాబాద్: నగరాలకు వచ్చి అద్దెకు గదులు తీసుకుని ఉండే యువతులు అప్రమత్తంగా ఉండాలని ఈ వార్తను గమనిస్తే తెలుస్తుంది. యువతులకు అద్దెకు గదులు ఇచ్చి.. వారి గదుల్లో సీక్రెట్ కెమెరాలను అమర్చాడు ఆ ఇంటి యజమాని. తన గదిలోని కంప్యూటర్, సెల్‌ఫోన్‌తో దానిని అనుసంధానం చేసుకున్నాడు. దీంతో ఆ గదిలో అమ్మాయిలు ఏంచేస్తున్నారో చూసేవాడు. అనుమానం వచ్చిన ఓ యువతి.. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నగరంలోని యూసుఫ్‌గూడ వెంకటగిరి హైలం కాలనీలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి తన సోదరుడు, స్నేహితురాలితో కలిసి రెండు నెలల క్రితం ఒక గదిలో అద్దెకు దిగారు. ఆ యువతులపై కన్నేసిన ఇంటి యజమాని సయ్యద్ సలీమ్ కొద్ది రోజుల క్రితం వారి గదికి ప్రత్యేకంగా విద్యుత్ మీటర్ బాక్సు పేరిట ఓ డబ్బాను ఏర్పాటు చేశాడు. అయితే, అందులో సీక్రెట్ కెమెరాలను అమర్చాడు. దీనికి సంబంధించిన వైర్‌గను తన గదిలోని కంప్యూటర్, ఫోన్‌కు అనుసంధానం చేసుకున్నాడు.

రెండు ప్రత్యేక డిజిటల్ వీడియో రికార్డర్లను ఏర్పాటు చేసుకుని ఒకదానిని యువతుల గదికి అనుసంధానం చేశాడు. యువతులు ఇంటికి రాగానే రహస్య కెమెరాల ద్వారా గదిలో ఉన్న వారిని సలీమ్ గమనిస్తుండేవాడు. అమ్మాయిలు దుస్తులు మార్చుకున్న దృశ్యాలను చూసేశాడు. సోమవారం రాత్రి అనుమానం వచ్చి డబ్బా తెరిచిన యువతులు అందులో కెమెరా చూసి షాకయ్యారు. దీని నుంచి వైరు యజమాని ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించారు.

ఈ వ్యవహారంపై వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడు సయ్యద్ సలీమ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సెల్‌ఫోన్, కెమెరా, డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సయ్యద్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అద్దె గదులు, హాస్టల్ గదుల్లో ఉండే యువతులు, విద్యార్థినులు ఇలాంటి ఘటనల పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసంర ఉంది. విద్యార్థినుల టాయ్‌లెట్లలో కెమెరాలు పెట్టిన ఓ ప్రిన్సిపల్ వ్యవహారం బయటపడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications