ప్రేమించిన యువతితో కాకుండా మరొకరితో పెళ్లి..: హోటల్ గదిలో యువకుడు.. z

హైదరాబాద్: తాను ప్రేమించిన యువతితో పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు.. మరో యువతితో వివాహాన్ని నిశ్చియించడంతో ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతిని వదులుకోలేక.. తల్లిదండ్రుల మాటకు ఎదురుచెప్పలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యువకుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని రామాంతాపూర్‌లో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
రామాంతాపూర్‌లోని గోకుల్‌నగర్‌కు చెందిన సాంబరాజు(22) సికింద్రాబాద్‌లోని ఓ నగరల దుకాణంలో పని చేస్తున్నాడు. కాగా, తాను ప్రేమించిన అమ్మాయితో కాకుండా.. మరో యువతిని పెళ్లి చేసుకోవాలని సాంబరాజును అతని కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి.. బేగంపేటలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నాడు.

 Hyderabad

తన వెంట తెచ్చుకున్న బ్యాగులో చున్నీ తీసి.. ఫ్యాన్‌కు ఉరివేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితులకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఫోన్‌లో దృశ్యాన్ని చూపించాడు. దీంతో సాంబరాజు మిత్రులు అప్రమత్తమై ఫోన్లోని లొకేషన్ ఆధారంగా అతడు ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. అయితే, వారు వచ్చేలోపే సాంబరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

యువకుడు ఉన్న గది తలుపులు అతని స్నేహితులు పగలగొట్టి కాపాడే ప్రయత్నం చేశారు. యువకుడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే సాంబరాజు మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సాంబరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+