Hyderabad CP Sandeep Shandilya: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత..
హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. బషీర్‌బాగ్‌లో పాత కమిషనర్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీపీ శాండిల్య ఆకస్మాతుగా కిందపడిపోయారు. గమనించిన అధికారులు దగ్గరలోని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కు వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.
తన ఆరోగ్యంపై వీడియో విడుదల చేసిన సీపీ సందీప్ శాండిల్య#SandeepShandilya #hyderabadCity #CP #HyderabadPoliceCommissioner #Oneindiatelugu pic.twitter.com/HD9CuMkgaB
— oneindiatelugu (@oneindiatelugu) November 20, 2023
మరికొన్ని పరీక్షలు చేయాల్సి అవసరం ఉందని చెప్పారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ప్రకటించారు. ఆస్పత్రిలో సందీప్ శాండిల్యను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ పరామర్శించారు. ఇటీవలే హైదరాబాద్ సీపీగా శాండిల్య నియమితులైన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో భద్రత పరంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ దిశనిర్దేశం చేస్తున్నారు. శాండిల్య గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ (రైల్వేస్ & రోడ్ సేఫ్టీ), డైరెక్టర్ జనరల్ (జైళ్లు)గా పనిచేశారు. శాండిల్య గోదావరిఖని (ASP), నల్గొండ (OSD), ఆదిలాబాద్ పోలీస్ సూపరింటెండెంట్‌గా పని చేశారు.

అయితే సందీప్ శాండిల్య తన ఆరోగ్యంపై వీడియో విడుదల చేశారు. " హాయ్ నేను సందీప్ శాండిల్య. ఈ రోజు స్వల్ప అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేర. తనకు కాస్త స్పండిలైటిస్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొంచెం లో బీపీ కూడా ఉంది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రేపటి నుంచి తిరిగి వర్క్ స్టార్ట్ చేస్తాను. పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో చేస్తున్నాను. నేను బాగానే ఉన్నాను. ధన్యవాదాలు" అంటూ వీడియోలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications