Hyderabad: హైదరాబాద్ ను కమ్మేసిన మేఘాలు.. కొద్ది గంటల్లో భారీ వర్షం..!
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నగరంలో ఉదయం నుంచి వేడి, వడగాలులతో ఇబ్బంది పడ్డారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నగరంలో వాతావరణ మారుతూ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సిటీని మబ్బులు కమ్మేశాయి. వాతావరణం కాస్త చల్లబడింది. అయితే గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ సిటీ జనాన్ని అలర్ట్ చేసింది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షం నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. నగరంలో క్యూములో నింబస్ మేఘాలు ఆవరించాయని పేర్కొంది. క్యూములో నింబస్ వల్ల సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మొస్తరు వానలు పడే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు మే 31నే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications