Hyderabad: హైటెక్ సిటీలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ, టెక్కీల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీలో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. శిక్షణతోపాటు ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు కాజేసిన సంస్థ నిర్వాహకులు.. నెలలుగా జీతాలు ఇవ్వకుండా చేతులెత్తేశారు. దీంతో తాము మోసపోయామంటూ ఉద్యోగార్థులు, టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల బిజినేపల్లి ప్రేమ్ ప్రకాష్ కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. సనత్‌నగర్‌లో నివాసం ఉంటూ స్నేహితుడు లిఖిత్‌తో కలిసి ఏడాది క్రితం కొండాపూర్ వెస్ట్రన్ పెరల్ భవనంలో సంటూ సూ ఇన్నోవేషన్స్ పేరిట ఐటీ కంపెనీ ప్రారంభించాడు.

తమ కంపెనీలో శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తామని ఒక్కో నిరుద్యోగి వద్ద రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు వసూలు చేశాడు. ఆ విధంగా సొమ్ము చెల్లించి కంపెనీలో చేరినవారికి రెండు నెలలు జీతాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏవో మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారు.
ఈ క్రమంలో కంపెనీ నిర్వాహకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఉద్యోగులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులు ప్రేమప్రకాష్, లిఖిత్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితులు దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గత రెండు మూడు నెలల క్రితం కూడా ఓ ఐటీ కంపెనీ ఇలాగే రాత్రిరాత్రే బోర్డు తిప్పేసింది. దీంతో అందులో పనిచేస్తున్న వందకుపైగా ఉద్యోగులు రోడ్డునపడ్డారు. ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications