హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్: ఆ మార్గంలో 3 నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపులు, ఎప్పట్నుంచంటే?
హైదరాబాద్: నగర వాసులకు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు పోలీసులు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి కొండాపూర్ వైపు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ చౌరస్తా నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిని మూడు నెలలపాటు మూసివేస్తున్నట్లు తెలిపారు.
మే 13వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 24 గంటలు పనులు జరుగుతాయని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

వాహనదారులకు అలర్ట్: ట్రాఫిక్ డైవర్షన్ ఈ రూట్లలో..
ఓఆర్ఆర్ నుంచి హఫీజ్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్ శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ - మీనాక్షి టవర్స్ - డెలాయిట్ -ఏఐజీ హాస్పిటల్ - క్యూ మార్ట్ - కొత్తగూడ ఫ్లైఓవర్.- హఫీజ్‌పేట వద్ద మళ్లించబడుతుంది.
లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్- డీఎల్ఎఫ్ రోడ్ - రాడిసన్ హోటల్ - కొత్తగూడ - కొండాపూర్ వద్ద మళ్లించబడుతుంది.
విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. ఎడమ మలుపు - గచ్చిబౌలి స్టేడియం - డీఎల్ఎఫ్ రోడ్ - రాడిసన్ హోటల్ - కొత్తగూడ ఫ్లైఓవర్- ఆల్విన్ వద్ద యూ
టర్న్ తీసుకోవాలి.
టోలిచౌకి నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ - మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. సైబర్ టవర్స్ జంక్షన్. - హైటెక్స్ సిగ్నల్ వైపు ఎడమవైపు - కొత్తగూడ జంక్షన్- ఆల్విన్.
టెలికాం నగర్ నుంచి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ ఫ్లైఓవర్ కింద గచ్చిబౌలి వద్ద యు టర్న్ వద్ద మళ్లించబడుతుంది. బస్ స్టాప్ పక్కన శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ - మీనాక్షి టవర్స్ - డెలాయిట్ - ఏఐజీ హాస్పిటల్ - క్యూ మార్ట్ - కొత్తగూడ- కొండాపూర్.
ఆల్విన్ ఎక్స్ రోడ్ నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ కొత్తగూడ జంక్షన్‌గా మళ్లించబడుతుంది. హైటెక్స్ రోడ్డు వైపు - సైబర్ టవర్లు - మైండ్‌స్పేస్ జంక్షన్. శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ - గచ్చిబౌలి / ఓఆర్ఆర్.
ఆల్విన్ ఎక్స్ రోడ్డు నుంచి లింగంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ బొటానికల్ గార్డెన్ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. అటుగా వెళ్లే వాహనదారులు ఈ ట్రాఫిక్ సూచనలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసువాలకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications