హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ వీసా సేవలపై వీడియో: కొత్త అడ్రస్ ఇదే
హైదరాబాద్: నగరంలోని యూఎస్ కాన్సులేట్ నానక్‌రామ్‌గూడలోని తన కొత్త ఫెసిలిటీలో వీసా సేవలను వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది.
హైదరాబాద్: నగరంలోని యూఎస్ కాన్సులేట్ నానక్‌రామ్‌గూడలోని తన కొత్త ఫెసిలిటీలో వీసా సేవలను వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో కాన్సులర్ ఆఫీసర్ కాథీ పలు విషయాలు వెల్లడించారు. యూఎస్ సందర్శించడానికి లేదా వీసా కోసం దరఖాస్తు చేసే విధానాన్ని వివరించారు.
ప్రక్రియ మారలేదని, బయోమెట్రిక్స్, ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్లు చేయడంలో ఇప్పటికే పాల్గొంటున్నట్లు చెప్పారు. బయోమెట్రిక్స్ అపాయింట్‌మెంట్లు ఇప్పుడు కొత్త వీసా అప్లికేషన్ సెంటర్(వీఏసీ) లొకేషన్‌లో జరుగుతాయని, ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ హైదరాబాద్‌లోని నానాక్‌రామ్‌గూడలోని కొత్త యూఎస్ కాన్సులేట్‌లో జరుగుతుందని క్యాథీ వివరించారు.

కొత్త కార్యాలయం చిరునామాను కూడా ఆమె చెప్పారు. ఇది సర్వే నంబర్ 115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ అని చిరునామాను కూడా తెలిపారు.
Here’s a short video on how one can reach the Visa Application Center (VAC), located at the Lower Concourse, HITEC City Metro Station, Madhapur, HYD 500081. pic.twitter.com/hyJuhzrIBR
— U.S. Consulate General Hyderabad (@USAndHyderabad) March 17, 2023
వీడియో డ్రాప్ బాక్స్ ప్రొసెసింగ్‌ను కూడా కవర్ చేస్తుంది. 48 నెలల క్రితం వీసా గడువు ముగియకుంటే దరఖాస్తుదారులు ఇప్పటికీ డ్రాప్‌బాక్స్‌ను ఉపయోగించుకోవచ్చు. అన్ని డ్రాప్ బాక్స్ కేసులు వీఏసీకి తీసుకెళ్తారు. కాన్సులర్ విభాగానికి బదిలీ చేస్తారు.
For some basic information about visa services at our new facility in Nanakramguda, please check out this video. pic.twitter.com/rMuRwI5FPb
— U.S. Consulate General Hyderabad (@USAndHyderabad) March 17, 2023
ఇక మరో వీడియోలో మదాపూర్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లోని లోయర్ కన్‌కోర్స్ వద్ద ఉన్న వీఏసీకి ఎలా చేరుకోవాలో వివరించింది హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్.
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
గెట్ అవుట్: నమ్మకమైన స్నేహితురాలికే ట్రంప్ షాక్. -
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి! -
H1B Visa: 85 వేల మందికి లక్కీ ఛాన్స్, సెలెక్షన్ లిస్ట్ వచ్చేసింది! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications