బట్టతల ఎంత పనిచేసింది.. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిన కొడుకు..

బట్టతల అనే సమస్య చాలామందికి చాలా చిన్న సమస్యలా అనిపించవచ్చు. కానీ బట్టతలను కవర్ చేసుకోలేక వాళ్లు పడే కష్టాలు వర్ణనాతీతం. ఇటీవలే బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బట్టతల ఇతివృత్తంగా 'బాలా' అనే సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో బట్టతలను కవర్ చేసుకునేందుకు ఆయుష్మాన్ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయితే తలపై వెంట్రుకలు లేనంత మాత్రాన జీవితాన్నే కోల్పోయినట్టు ఫీల్ అవాల్సిన అవసరం లేదు. కానీ 18 ఏళ్ల ఓ యువకుడు బట్టతల సమస్య గురించి అతిగా ఆలోచించి.. కుమిలిపోయి.. చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అసలేం జరిగింది :

అసలేం జరిగింది :

హైదరాబాద్‌లోని కొండాపూర్‌కి చెందిన 18 ఏళ్ల కుర్రాడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. కొన్నాళ్లుగా సైనస్ సమస్యతో పాటు జుట్టు రాలడం అతన్ని వేధిస్తోంది. క్రమక్రమంగా తలపై జుట్టంతా రాలిపోయి బట్టతలలా మారిపోయింది.

చిన్న వయసులో బట్టతల రావడంతో.. :

చిన్న వయసులో బట్టతల రావడంతో.. :


18ఏళ్లకే బట్టతల రావడంతో అతను తీవ్రంగా కుమిలిపోయాడు. బట్టతల సమస్యపై తల్లిదండ్రుల వద్ద కూడా చాలాసార్లు బాధపడ్డాడు. తల్లిదండ్రులు అదేమీ పెద్ద సమస్య కాదని,బాధపడవద్దని అతన్ని ఓదార్చారు. అయినప్పటికీ అతని మనసు మారలేదు.బట్టతలతో స్నేహితులతో కలిసి తిరగలేనని ఆవేదన చెందాడు.

 ఆత్మహత్య.. :

ఆత్మహత్య.. :

ఈ నెల 6న ఉదయం స్నానం చేసేందుకని బాత్రూమ్‌లోకి వెళ్లిన అతను ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది తలుపుపై బాదినా లాభం లేకపోయింది. చివరకు తలుపులు పగలగొట్టి చూడగా బాత్రూమ్‌లోనే అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బట్టతల సమస్య కారణంగానే చనిపోతున్నట్టు అతను రాసిన సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కొడుకు మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+