Hyderabad: ప్రమాదంలో హైదరాబాదీలు.. ఇంకా నిర్లక్ష్యం చేస్తే మరణ మృదంగమే..!
దేశంలో గాలి కాలుష్య తీవ్రత భారీగా పెరుగుతోంది. ఢిల్లీ అయితే తీవ్రమైన పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ మెరుగైన పరిస్థితి ఏమి లేదు. ఇక్కడ కూడా గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతోంది. ఇలానే లైట్ తీసుకుంటే ఢిల్లీ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 69గా. ఇది మరింత పెరిగితే ప్రమాదమేనని చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)0-50 ఉంటే బాగున్నట్లు. 50-100: మితమైనదిగా భావించవచ్చు. 100-200 ఉంటే కాస్త ఇబ్బందే. ఇక 200-300 రోగాలు తప్పవు. 300-400 ఉంటే తీవ్రమైనదిగా పరిగణిస్తారు. 400-500+ ఉంటే బతకడం కష్టమే.
ప్రస్తుతం హైదరాబాద్ AQI 69 అంటే గాలి మితంగా ఉంది. దీపావళి సందర్భంగా ఇది పెరిగింది. జూ పార్క్ ప్రాంతంలో AQI 155 గా ఉంది. ఇక్కడ గాలి నాణ్యత దారుణంగా ఉంది. షిర్డీ సాయి నగర్ AQI 34 గా ఉంది. ఇక్కడ గాలి స్వచ్ఛమైనదిగా ఉంది. హైదరాబాదులో వాయు కాలుష్యం రెండు ప్రధాన రకాలైన పర్టిక్యులేట్ మ్యాటర్ కారణమని చెబుతున్నారు. అవి PM10, PM2.5. PM10 కణాలు, సాధారణంగా దుమ్ము, పొగ నుంచి వస్తాయి. ఇవి సుమారు 10 మైక్రోమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి.

హైదరాబాద్ ప్రస్తుత PM10 స్థాయి క్యూబిక్ మీటరుకు 70 మైక్రోగ్రాములుగా ఉంది. M2.5 ఇవి చిన్న కణాలు, 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోవటం వలన మరింత హానికరం. హైదరాబాద్‌లో పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 30 మైక్రోగ్రాములుగా ఉంది. బర్కిలీ ఎర్త్ థంబ్ నియమం ప్రకారం, ప్రతి 22 మైక్రోగ్రాముల ప్రతి క్యూబిక్ మీటర్ PM2.5 రోజుకు ఒక సిగరెట్ తాగడానికి సమానం. హైదరాబాద్‌లో పీఎం2.5 స్థాయి 30 మైక్రోగ్రాములు ఉన్నందున, ఇక్కడ గాలిని పీల్చడం అంటే రోజూ 1.4 సిగరెట్లు తాగడంతో సమానం.

హైదరాబాద్ లో ఉన్న వారు గాలి పీల్చి రోజుకు 1.4 సిగరెట్లు తాగుతున్నారు. ఇది భవిష్యత్ లో పెరిగే అవకాశం. ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటే పెను ప్రమాదాలు తప్పే అవకాశం ఉంటుంది. గాలి కాలుష్యం వల్ల పిల్లలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. అస్తమా వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications