Hydra: హైడ్రా కీలక నిర్ణయం.. ఒక్కో చెరువు వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులు..!
గత 50 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని చెరువులు దాదాపు 60 శాతానికి పైగా కబ్జాకు గురయ్యాయి. భవిష్యత్ లో హైదరాబాద్ లో ఇక చెరువులు కనిపించకపోవచ్చు. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసింది. కమిషనర్ గా రంగనాథ్ ను నియమించింది. హైడ్రా వచ్చిన నుంచి అక్రమార్కులు హడలిపోతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల చెరువులను అక్రమించి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది.
చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. తాజాగా చెరువులకు రక్షణ కల్పించాలని హైడ్రా నిర్ణయించింది. అందులో భాగంగా ఒక్కో చెరువు వద్ద ఇద్దరు చొప్పున సెక్యూరిటీ గార్డులను నియమించాలని ప్లాన్ చేస్తోంది. అలాగే చెరువుల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్ లో ఒక్క చెరువు కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 450 చెరువులు ఉన్నాయి.

ఇందులో ఓఆర్ఆర్ లోని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో 300 చెరువులు, హైదరాబాద్ లో 185 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొదటగా కొద్ది చెరువుల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించి.. కొద్ది రోజులు చూడనుంది. ఇది సక్సెస్ అయితే మిగతా చెరువుల వద్ద కూడా ఇదే పని చేయనుంది. మరోవైపు నాళాలను కూడా పరిరక్షించడానికి హైడ్రా ప్లాన్ చేస్తోంది. నాలాల సర్వే చేపట్టింది. షేక్ పేటలోని బల్కాపూర్ నాలా, టోలి చౌకి లోని నాలాపై సర్వే చేసింది.
ఈ ప్రాంతాల్లో దాదాపు 5కిలోమీటర్ల మేర ఈ నాలా విస్తరించి ఉండగా 3 కిలోమీటర్లు కబ్జాకు గురైంది. 2 కిలోమీటర్ల మేరా బాగుంది. భవిష్యత్ ఇది కూడా కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నాలా పై సుమారు 50 అక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని ఇప్పుడు కూల్చివేయనున్నారు. ప్రస్తుతం హైడ్రా సైలెంట్ గా ఉంది. మరోసారి ఎప్పుడు కూల్చివేతలు చేపడుతుందో చూడాలి.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications