Hydra: మాదాపూర్ లో అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా..
హైదరాబాద్ లో హైడ్రా దూసుకెళ్తోంది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. మధ్యలో కొద్ది రోజులు గ్యాబ్ ఇచ్చిన హైడ్రా ఆదివారం నుంచి మళ్లీ కూల్చివేతలు ప్రారంభించింది. సోమవారం మాదాపూర్ లోని అక్రమ నిర్మాణాలను కుల్చివేసింది. కావురి హిల్స్ పార్క్ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేయించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు పూర్తి చేశారు. కావూరి హిల్స్ పార్క్ లో ఉన్న స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు.
అక్రమ నిర్మాణాలను తోలగించి చోట కావురిహిల్స్ పార్క్ అని బోర్డు కూడా పెట్టారు. కాగా.. కావురి హిల్స్ అసోషియషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లీజుకు ఇచ్చిందని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు. గడువు ముగియకముందే నిర్మాణాలు తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం హైడ్రా అమీన్ పూర్ తో పాటు కూకట్ పల్లి లో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ గూడ, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను పడగొట్టింది.

ఉదయం 6 గంటల నుంచి రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి 3 ప్రొక్లైనర్ల సహాయంతో భారీ పోలీసు బందోబస్తుల నడుమ కూల్చివేతలు చేపట్టారు. రాత్రి వరకు కూల్చివేతలు సాగాయి. కిష్టారెడ్డిపేటలో 3 అపార్ట్మెంట్లను హైడ్రా కూల్చివేసింది. బాహుబలి జంబో బుల్డోజర్ తో ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చి వేసింది. ఎవరు కూడా కబ్జా చేసి భవన నిర్మాణాలు చేపట్టకూడదని హైడ్రా స్పష్టం చేసింది. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
మాదాపూర్ తో హైడ్రా కూల్చివేతలు
— Congress for Telangana (@Congress4TS) September 23, 2024
కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను కూలుస్తున్న హైడ్రా#HYDRAA #Hydra pic.twitter.com/pFe5RJRMvp
ఇటు కూకట్ పల్లి నల్ల చెరువులోని బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. అయితే తమకు కాస్త టైమ్ ఇవ్వాలని బాధితులు కోరినా ఇవ్వలేదని చెబుతున్నారు. హైడ్రా లక్ష్యం మంచిదే అయినప్పటికీ.. కాస్త మానవత్వం వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications