సహకరిస్తాం, రేవంత్‌కు టీపీసీ ఇవ్వడంపై షబ్బీర్ అలీ, కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు (వీడియో)

యువనేత రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిద్దరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కొందరు సీనియర్ నేతలు మాత్రం అన్ని విధాలా సహకరించి అందరినీ కలుపుకుని పనిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. అతనికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

హ్యాపీగా ఉంది..

హ్యాపీగా ఉంది..

రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందని షబ్బీర్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి బలంగా పోరాడుతారన్నారు. పార్టీలోని అంతర్గత సమస్యలు అన్నీ త్వరలో సమసిపోతాయన్నారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే హై కమాండ్ పరిష్కరిస్తుందని తెలిపారు. రేవంత్ రెడ్డి అందరిని కలుపుకుని పనిచేస్తారని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తామని వివరించారు.

మిన్నంటిన సంబరాలు

మిన్నంటిన సంబరాలు

రేవంత్‌ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవీ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. రేవంత్ క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానుల సందడి నెలకొంది.క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలను రేవంత్ కలువనున్నారు. రాత్రి కొందరు సీనియర్లను రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళమరికొందరిని కలిసే అవకాశం ఉంది. అందరితో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను రేవంత్‌ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది.

వేంపేటలో టపాసులు పేల్చి..

ఇటు జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ప్రకటించడంపై మెట్ పల్లి మండలం వేంపెట్ గ్రామంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. జై రేవంత్ రెడ్డి అని నినదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి మహేందర్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, నాయకులు అల్లూరి సురేందర్ రెడ్డి, మామిడి మహేశ్వర్ రెడ్డి, వెల్మల రాజారెడ్డి, మహమ్మద్ అలీ, సలీం, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+