Hyderabad: వారు లిఫ్ట్ ఉపయోగిస్తే రూ.1000 జరిమానా.. వైరల్ అవుతోన్న ఫొటో..

బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం అనవాయితీ.. అవును ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతోందని అనడంలో సందేహం లేదు. చాలా మంది ధనవంతలు పేదవారిని జంతువుల కన్నా హీనంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఉన్న వారు లేనివారిని మనుషులుగా గుర్తించడానికి ఇష్టపడరు. తాజాగా ఓ గేటెడ్ కమ్యూనిటీలో లిఫ్ట్ వద్ద ఉంచిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ లో గృహిణులు(ఇళ్లలో పని చేసేవారు), డెలివరీ ఏజెంట్లు, ఇతర కార్మికులు తమ భవనంలోని లిఫ్ట్‌ను ఉపయోగించవద్దని పేర్కొన్నారు.

ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని పోస్టర్ లో హెచ్చరించారు కూడా. లిఫ్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ పోస్టర్ ఫొటోను నవంబర్ 28న సోషల్ మీడియాలో ఓ మహిళ పోస్ట్ చేశారు. షహీనా అత్తర్వాలా అనే మహిళ ఈ నోటీసు ఫొటో పోస్ట్ చేశారు. "ఈ సమాజంలో మనం డార్క్ అండ్ డర్టీ సీక్రెట్స్ ను దాచడానికి ప్రోగ్రామ్ చేశాం. ఈ రోజు మనం కష్టపడి పనిచేసే వ్యక్తులతో కలిసి జీవించలేమని భావిస్తున్నాం. ఒకవేళ వారు పట్టుబడితే రూ.1000 జరిమానా విధిస్తారా? ఇది నేరమా? ఇది బహుశా వారి జీతంలో 25% కావచ్చు అని" అని ఆమె రాసుకొచ్చారు.

If they use a lift in a gated community, they are warned that they will be fined Rs.1000


ఈ ఫొటోపై చాలా మంది నెటిజన్లు స్పందించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికీ మనుషులపై వివక్ష చూపడం దారుణమని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి కొందరు మాత్రం పోస్టర్ వారు అలా చెప్పినా ఎవరు వినరు.. లిఫ్ట్ ఉపయోగిస్తారని కామెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ దీన్ని అనాగరికమైన చర్య పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+