ఇన్‌స్టా రిచ్ లిస్ట్: వెంకటేశ్ కూతురుకు చోటు.. ఒక్కో పోస్టుకు రూ.29 వేలు
ఇటీవల సోషల్ మీడియా ఇన్‌స్ట్రాగ్రామ్ రిచ్ లిస్ట్ విడుదల చేసింది. అందులో క్రిస్టియానో రొనాల్డొ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కో పోస్టుకు రూ.11.9 కోట్లు ఆర్జిస్తున్నాడు. కోహ్లీ రూ.5 కోట్లు సంపాదిస్తున్నారు. ఇక మిగతావారి డేటా కూడా పరిశీలిస్తే.. ప్రముఖ నటుడు వెంకటేశ్ కూతురు కూడా ఇన్ స్టలో ఆర్జిస్తున్నారు. వారి అంతా కాకున్నా ఒక్కో పోస్టుకు రూ.29 వేల వరకు సంపాదిస్తున్నారు.

అశ్రితకు చోటు..
సెలబ్రిటీల పాలిట ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వనరుగా మారింది. ఇటీవల సెలబ్రిటీల ఇన్ స్టాగ్రామ్ ఆదాయ వివరాలను వెల్లడించగా.. ఈ జాబితాలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రిత కూడా ఉన్నారు. జాబితాలో వరల్డ్ వైడ్‌గా అశ్రితకు 377వ స్థానం లభించింది. ఆసియాలో ఆమె 27వ స్థానంలో ఉన్నారు. అశ్రిత ఇన్ స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు దాదాపు రూ.29 వేలు వస్తాయట.

వంటల వీడియోలు..
ఇన్ఫినిటీ ప్లాటర్ అనే అకౌంట్‌తో ఆశ్రిత ఇన్ స్టాగ్రామ్‌లో వంటల వీడియోలను పంచుకుంటున్నారు. ఇన్ స్టాలో ఇన్ఫినిటీ ప్లాటర్ అకౌంట్ కు 13 లక్షల మంది ఫాలొవర్లు ఉన్నారు. ఇదే ఆమెకు కాసులు కురిపిస్తోంది. బిస్కట్లు, కేకులు, ఇతర స్నాక్స్ ఐటమ్స్‌లో కొత్త రకాలను అశ్రిత సోషల్ మీడియాలో పరిచయం చేస్తుంటారు. అశ్రిత ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు. ఆమెకు రెండేళ్ల కిందట వినాయక్ రెడ్డితో వివాహం జరగ్గా, అప్పటి నుంచి స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో నివసిస్తున్నారు.

రొనాల్డొ టాప్ ప్లేస్
ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కువగా ఉన్నవారికి.. వారి చేసే పోస్టుకు అందిన స్పందన ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తున్నారు. ఈ సారి ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియనో రొనాల్డో టాప్ ప్లేస్‌లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో హాలీవుడ్ సూపర్ స్టార్ జాన్సన్, పాప్ సెన్సేషన్ ఆరియానా నిలిచారు. రొనాల్డొకు 308 మిలియన్ల ఫాలొవర్లు ఉన్నారు. అతను చేసే ఒక్కో పోస్టుకు ఇన్ స్ట.. రూ.11.9 కోట్ల మొత్తాన్ని అందజేస్తోన్న విషయం ఇటీవలే తెలిసింది.












Click it and Unblock the Notifications