హోంమంత్రినవుతా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంట్రవర్సీ వద్దంటూ కేటీఆర్‌తో!
హైదరాబాద్: కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర చర్చ సాగింది. వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న ముచ్చటకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
మీకు మంత్రి పదవి ఎప్పుడొస్తుందని కేటీఆర్ అడగ్గా.. మీ లాగా మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయ్.. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా..? సంకీర్త్ పోటీ చేస్తున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

అయితే, దీనికి బదులిస్తూ.. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం అక్కడ్నుంచి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు. కాగా, వీరి మధ్య చోటు చేసుకున్న సంభాషణ అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
హోమంత్రి కావాలంటున్న రాజగోపాల్ రెడ్డి
Recommended Video

తాను హోంమంత్రిని కావాలని అంటున్నారు కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనకు అధిష్టానం హామీ ఇచ్చిందని.. హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు.
కేసీఆర్‌ను గద్దె దించేందుకే తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్‌లో ఉంటారని అన్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. భువనగిరి, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో తమ కుటుంబసభ్యులెవరూ పోటీ చేయకూడదని తన ఆలోచన అని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని.. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి.












Click it and Unblock the Notifications