Weather Report: హైదరాబాద్‍లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఓ వైపు చలి.. మరోవైపు వాన..
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి అకాశం మేఘావృతం అయింది. ఉదయం 8 గంటల నుంచి సిటిలో పలు చోట్లు చిరు జల్లులు పడుతున్నాయి. దీంతో కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లవారు కాస్త ఇబ్బంది పడ్డారు. చిరుజల్లులతో నగరవాసులు గజగజ వణుకుతున్నారు.
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరం, శివారు ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా, శుక్రవారం ఉదయం మళ్లీ ఓ మోస్తరు నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, తార్నాక, పంజాగుట్ట, చింతల్, బాలానగర్, సుచిత్ర, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అమీర్పేట్, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, హబ్సిగూడ మొదలైన ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.

రోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. కుమురం భీం జిల్లా లో 14.1 గా నమోదు కాగా..ఆదిలాబాద్ జిల్లాలో 14.7, నిర్మల్ జిల్లా 16.5, మంచిర్యాల జిల్లా లో 16.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. మరికొన్ని రోజులు చలి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉదయం 11 గంటలైనా హైదరాబాద్ నగరాన్ని మంచు దుప్పటి వదలడం లేదు. హుస్సేన్ సాగర్ మంచు దుప్పుటి కప్పేసింది. దీంతో హుస్సేన్ సాగర్ ను చూసేందుకు జనం తరలి వస్తున్నారు. చాలా మంది సుందర దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బందిస్తున్నారు.












Click it and Unblock the Notifications