Hyderabad Rain: హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో వర్షం..

గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి వాన పడుతోంది. స్కూల్ వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు వర్షంతో ఇబ్బంది పడుతున్నారు. కూకట్ పల్లి, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, బోరబండ, రహమత్ నగర్, కృష్ణా నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తోపాటు పలు చోట్లలో భారీ వర్షం పడుతోంది. గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతంగా ఉంది. కాసేపు ఎండ ఆ తర్వాత మబ్బు కనిపిస్తోంది.

ఉత్తర తెలంగాణ ఆకాశం మేఘావృతమై ఉంది. రాష్ట్రంలో మధ్యాహ్నాన సమయంలో బాగానే ఎండలు కొడుతుండగా.. పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడుతోంది. ఇక హైదరాబాద్ లోనూ రెండు రోజులుగా మబ్బులు కమ్ముకుని వాతావరణం కూల్ మారింది. అలా ఉష్ణోగ్రత తగ్గలేదు. చలి తీవ్రత పెరగలేదు. సాధారణంగా నవంబర్ చలి తీవ్రత ఎక్కువగా ఉండాలి. కానీ వర్షలు, మబ్బులు రావడంతో చలి తీవ్రత అంతగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి కారణంగా తెలంగాణలో మాడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

It rained in many parts of Hyderabad city

మరోవైపుబంగాళాఖాతంలో దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లో ఈ నెల 26 నాటికి ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణించి ఈశాన్య బంగాళాఖాతం, అండమాన్ పరిసరాల్లో ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలహీన పడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో కృష్ణా, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో గురువారం రోజున దాదాపు ఆరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి, తెన్కాసి మరియు పుదుకోట్టై జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+