రోజాకు జబర్దస్ట్ టీం వీడ్కోలు.. కంటతడి పెట్టిన ఫైర్ బ్రాండ్..
జబర్దస్త్ ప్రోగ్రాం.. తెలుసు కదా.. జడ్జీగా చేసి రోజా మరింత ఫేమ్ అయ్యారు. ఇదివరకు నాగబాబు కూడా చేసేవారు. కానీ ఆయన మరో ఛానెల్‌లోకి వెళ్లారు. అయితే ఇటీవల రోజా మంత్రిగా నియమితులయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె షో.. ఇతర కార్యక్రమాలు చేసే వీలులేకుండా పోయింది. ఇదివరకు ఎమ్మెల్యేగా అయితే సమయం ఉండేది.. కానీ మంత్రి కావడంతో టైమ్ లేదు. దీంతో జబర్దస్త్ టీమ్ ఆర్కే రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు. మాట్లాడుతూనే రోజా కంట తడి పెట్టుకున్నారు.

రెండుసార్లు ఎమ్మెల్యే..
నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా రోజాగా గెలిచారు. మంత్రి పదవీ చేపట్టారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా కొనసాగారు. ఇప్పుడు తాను మంత్రిని కావడంతో బాధ్యతలు పెరిగాయని రోజా చెప్పారు. ఇకపై సినిమాలు, టీవీ షోలు చేయలేనని ఇటీవలే రోజా ప్రకటించారు. జబర్దస్త్ టీమ్ తమ అభిమాన రోజాకు వీడ్కోలు పలికారు. ఆమె పాల్గొన్న చివరి ఎపిసోడ్‌లో ఘనంగా సత్కరించారు. రోజా కన్నీటి పర్యంతమైంది. రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు జబర్దస్త్‌లో ఉన్నానని, ఇప్పుడు మంత్రి అయినప్పుడు కూడా ఇక్కడే ఉన్నానని సంతోషం వ్యక్తం చేశారు.

సేవా కార్యక్రమాలు..
తనకు సేవ చేయడం ఎంతో ఇష్టమని రోజా చెప్పారు. జబర్దస్త్ వంటి ఇష్టమైన కార్యక్రమాలను వదులుకోవాల్సి వస్తోందని చెప్పారు. అవకాశం ఇచ్చిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రోజా వీడ్కోలు ఎపిసోడ్‌లో ఇతర యాంకర్లు, పార్టిసిపెంట్లు కూడా భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. త్వరలో ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

టీడీపీ టు వైసీపీ
రోజా.. రాజకీయ నేపథ్యం టీడీపీలో ప్రారంభమైంది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా.. అక్కడినుంచి వైఎస్ఆర్ సీపీలో చేరారు. జగన్ వెన్నంటే ఉండేవారు. ప్రతీ కార్యక్రమంలో పాల్గొనేవారు. రోజా పడిన కష్టానికి ఫలితం లభించింది. ఊరించినా మంత్రి పదవీ దక్కింది. దీంతో ఆమె టీవీ షోలు, సినిమాలు.. ఇతర కార్యక్రమాలకు తప్పకుండా దూరం కావాల్సి వచ్చింది. కానీ ఇన్నాళ్లూ వారితో రోజా ఉన్నారు. సో వారి అటాచ్ మెంట్.. గుర్తుకువచ్చి ఇరువురు కంటతడి పెట్టుకున్నారు. మళ్లీ కలవలేం అంటూ బోరున ఏడ్చారు.

రోజా లేని లోటు
జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి రోజా, నాగబాబే కాదు.. టీమ్ లీడర్స్ కూడా మంచి పేరు సంపాదించారు. మూవీలలో అవకాశం కూడా దక్కించుకున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ ప్రోగ్రాం కూడా మంచి హిట్ అయ్యింది. జడ్జీలు కూడా టైమింగ్ పంచ్ వేస్తూ.. షోకు మరింత హైప్ తీసుకొచ్చారు. షో నుంచి నాగబాబు దూరం అయిన తర్వాత ఆ స్థానంలో నాగుర్ బాబు వస్తున్నారు. కానీ ఆ స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ఇప్పుడు రోజా వెళ్లడంతో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications