టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌కు హైకోర్టులో ఊరట.. ఏం జరిగిందంటే..!
హైదరాబాద్ : కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్య మరోసారి వార్తల్లోకెక్కారు. ముగ్గురు సంతానం ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఆమె తప్పుడు అఫిడవిట్ ఇచ్చారనే ఆరోపణలతో కేసు నడిచింది. ఎన్నికల రూల్స్‌కు విరుద్దంగా వ్యవహారించారనే కారణంతో ఆమెపై ఇటీవల నాంపల్లి కోర్టు వేటు వేసింది. అయితే అక్కడి న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు చైతన్య. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇదివరకు నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ తీర్పు చెప్పింది.
కార్పొరేటర్‌గా చలామణీ కావడానికి నిజాన్ని దాచిపెట్టారనే ఆరోపణలతో కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్యపై వేటు పడింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారనే కారణంతో ఆమె ఎన్నిక చెల్లదంటూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు ముగ్గురు సంతానమున్నా.. ఎన్నికల అఫిడవిట్‌లో ఇద్దరిని మాత్రమే చూపించారనే సాకుతో బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవి భర్త రమేశ్ యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో కన్నా చైతన్య తనకు ముగ్గురు సంతానం ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టినట్టు తేలింది. దాంతో ఈ నెల మూడవ తేదీన ఆమె ఎన్నిక చెల్లదంటూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.

రమేశ్ యాదవ్ ఫిర్యాదు మేరకు నాంపల్లి న్యాయస్థానంలో కేసు నడిచింది. ఆ క్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్య ఎన్నికల చెల్లదంటూ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు విచారణలోనూ ఆమె తనకు ముగ్గురు సంతానం ఉన్నారనే విషయం దాచిపెట్టినట్లు రుజువైంది. దాంతో సదరు కార్పొరేటర్‌పై అనర్హత వేటు వేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. రెండోస్థానంలో ఉన్న ఉమాదేవీ రమేశ్‌యాదవ్‌ను కార్పొరేటర్‌గా కొనసాగించాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కార్పొరేటర్ కన్నా చైతన్య హైకోర్టును ఆశ్రయించారు. దాంతో న్యాయస్థానం స్టే విధించడంతో ఆమెకు ఊరట లభించినట్లైంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications